English   

వరుణ్ తేజ్ సినిమలో.. పవన్ కళ్యాణ్ తాతయ్య 

varuntej-pawan
2018-09-11 19:50:54

కొన్ని కాంబినేషన్స్ ఆసక్తిని పెంచుతాయి. ఇక ఇది టాలెంటెడ్ కాంబో అయితే మరింత క్యూరియాసిటీ పెరుగుతుంది. యస్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదీ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మోస్ట్ టాలెంటెడ్ బాలీవుడ్ యాక్టర్ బొమన్ ఇరానీ మనవారిని బాగా ఆకట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ తాతయ్యగా అతని నటనకు మనాళ్లు ఫిదా అయ్యారు. త్రివిక్రమ్ అతన్ని ఏరికోరి ఎందుకు తెచ్చుకున్నాడో కూడా అర్థమైంది.  తర్వాత నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాలోనూ ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో అతను ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమాలోనూ నటించబోతున్నట్టు సమాచారం. 

ప్రస్తుతం వరుణ్ తేజ్ సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో అంతరిక్షం అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే వైవిధ్యమైన సినిమాలతో మంచి నటుడుగా ప్రూవ్ చేసుకున్న వరుణ్ కు ఇది ఖచ్చితంగా మెమరబుల్ మూవీ అవుతుందని చెబుతున్నారు. ఇక ఈ మూవీ తర్వాత కూడా అతను మరో వైవిధ్యమైన దర్శకుడికే ఓటేశాడు. అతనెవరో కాదు.. సాగర్ చంద్ర. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాతో బ్రిలియంట్ డైరెక్టర్ అనిపించుకున్న సాగర్ చంద్ర ఈ సారి కూడా ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ తోనే రాబోతున్నాడు. వరుణ్ తేజ్ కు ఈ కథ బాగా నచ్చింది. కాంబినేషన్ ఓకే అయింది. అయితే ఈ మూవీలో ఓ కీలక పాత్రలో బొమన్ ఇరానీని తీసుకుంటున్నాడట సాగర్ చంద్ర. 

అయితే ఇప్పటి వరకూ బొమన్ ఇరానీ చేసిన పాత్రలకు భిన్నంగా ఈ పాత్ర మోస్ట్ పవర్ ఫుల్ గా ఉంటుందట. అందుకే ఆయనైతే ఈ పాత్ర మరింత బావుంటుందని దర్శకుడు ఫీలయ్యాడట. కథ నచ్చడంతో బొమన్ కూడా ఈ పాత్రకు ఓకే చెప్పినట్టు టాక్. మొత్తంగా అలా పవన్ కళ్యాణ్ తాతయ్య.. వరుణ్ తేజ్ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడన్నమాట. ఇక ఈ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ త్వరలోనే తెలియజేస్తారు. 

More Related Stories