English   

తమన్నా అందుకు ఒప్పుకుందా.. ?

Tamannaah Bhatia Doing Item Song With Naga Chaitanya
2018-09-11 21:45:30

అక్కినేని నాగ చైతన్య లేటెస్ట్ మూవీ శైలజా రెడ్డి అల్లుడు.. తర్వాత.. సవ్యసాచి. యస్.. నెక్ట్స్ రాబోతోన్న సినిమా సవ్యసాచినే. నిజానికి ఈ సినిమానే ముందు రావాల్సి ఉంది. కానీ ఎందుకో శైలజారెడ్డి అల్లుడుపైనే ఈ సవ్యసాచికి ఎక్కువ నమ్మకం ఉందట. అందుకే కొన్నాళ్లు ఈ మూవీని పక్కన బెట్టాడు. ఈ లోగా అప్పటికే చేసిన కొన్ని సీన్స్ కూడా నచ్చలేదు. దీంతో వాటిని రీ షూట్ చేస్తూ మిగిలిన పార్ట్ షూట్ చేస్తూ ఇప్పుడు బిజీగా ఉన్నాడు చైతూ. నాగ చైతన్య వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ప్రేమమ్ తో తిరుగులేని హిట్ ఇచ్చి.. అతనికి అతని ఒరిజినల్ స్ట్రెంత్ ను తెలియజేసిన దర్శకుడు చందు మొండేటి ఈ సవ్యసాచికి దర్శకుడు. చందుకు మంచి టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరుంది. అయినా ఇతను మారుతికే ఓటేశాడు. సరే ఆ మేటర్ లో ఎవరు గెలుస్తారు అనేది పక్కన బెడితే ఇప్పుడు సవ్యసాచిలో తమన్నా కూడా నటించబోతోంది. ఆల్రెడీ హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ అయింది. మళ్లీ ఇప్పుడు తమన్నా ఎలా నటిస్తుంది అనుకుంటున్నారా..?

ఐటమ్ సాంగ్... యస్.. తమన్నా సవ్యసాచిలో ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్టు బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. చైతూ, తమ్మూల మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది. గతంలో ఈ ఇద్దరూ, హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమాతో ‘తడాఖా’ చూపించారు.  అందుకే అమ్మడు చెయ్ సినిమాలో ఐటమ్ సాంగ్ అనగానే వెంటనే ఒప్పుకున్నట్టు టాక్. అన్నట్టు ఈ పాట కూడా రీమిక్స్. అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన అల్లరి అల్లుడులో వచ్చే ఐటమ్ సాంగ్ నే ఇప్పుడు రీమిక్స్ చేయబోతున్నారు. ఆ పాట ‘నిన్ను రోడ్డుమీద చూసినదీ లగాయితూ’ అనే పాట. అప్పుడు రమ్యకృష్ణ ఈ పాటలో మెరిసింది. ఇప్పుడా పాట రీమిక్స్ లో నర్తించడానికి తమన్నా ఒప్పుకున్నట్టు సమాచారం. ఏదేమైనా తమన్నా ఐటమ్ సాంగ్ చేస్తే సినిమా హిట్ అనే సెంటిమెంట్ కూడా ఈ సినిమాకు కలిసొస్తుందేమో చూడాలి. అన్నట్టు ఈ సవ్యసాచిని కూడా ఈ యేడాదే విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నారట.

More Related Stories