English   

శ్రీయ... మిసమిసలు తగ్గని బ్యూటీ

Hottest Actress Shriya Saran Birthday Special
2018-09-11 23:32:05

శ్రీయ.. మూడున్నర దశాబ్ధాల వయసు దాటినా ఇంకా మిసమిసలు తగ్గని బ్యూటీ. ఈ సోయగం పుట్టి 36యేళ్లు. యస్ ఇవాళ(11.09.18) శ్రీయ పుట్టిన రోజు.రీసెంట్ గా ఓ విదేశీయున్ని పెళ్లి కూడా చేసుకుంది. అయినా అమ్మడు ఏ మాత్రం తగ్గకుండా అప్పుడప్పుడూ అందాలారబోస్తూనే ఉంది. అందుకే ఇప్పటికీ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం హాట్ హాట్ గా ఆఫర్స్ అందుకుంటోన్న ఈ భామ ప్రస్తుతం తెలుగులో వీర భోగ వసంత రాయలు అనే సినిమాలో నటిస్తోంది. నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ మూవీ నుంచి ఓ టీజర్ విడుదల చేశారు. అది కూడా శ్రీయ బర్త్ డే స్పెషల్ గా. కానీ టీజర్ చూస్తే అలా లేదు. తన క్యారెక్టర్ మొత్తం ఎంత అగ్రెసివ్ గా ఉంటుందో చూపించారు. అలాగే అమ్మడు ఓ చైన్ స్మోకర్ అన్న విషయం ఈ టీజర్ చూస్తే తెలుస్తుంది. చూస్తోంటే తనేదో పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెందిన లేడీగా నటిస్తుందేమో అనిపిస్తోంది. ఆ విషయంలోనే చాలా సీరియస్ గా కనిపిస్తోన్న తను ఉన్న రెండు సీన్స్ లోనూ సిగరెట్ పొగలు రింగులు రింగులుగా వదులుతూనే ఉంది.

ఇక 2001లో ఇష్టం అనే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన శ్రీయ సంతోషంతో బ్రేక్ తెచ్చుకుని ఆ వెంటనే స్టార్ హీరోల సరసన ఆఫర్స్ కొట్టేసింది. అప్పటి క్రేజీ యంగ్ స్టర్స్ అయిన తరుణ్, ఉదయ్ కిరణ్ లతో పాటు ‘యంగ్ మాస్ టర్స్’ అయిన ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి హీరోల సరసనా నటించింది. అటు మెగాస్టార్, బాలయ్యలతోనూ రొమాన్స్ చేసింది. మొత్తంగా కొన్నాళ్ల పాటు టాప్ హీరోయిన్ ప్లేస్ లో ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ మూణ్నాలుగేళ్ల క్రితం వరకూ కూడా చాలా బిజీగానే ఉంది. కానీ కొత్త భామల రాకతో కాస్త వెనక బడ్డా తన ఫిగర్ లో మార్పులు రాకపోవడం విశేషం. మొత్తంగా పెళ్లి తర్వాత సెలెక్టెడ్ గా మూవీస్ చేస్తా అంటోన్న శ్రీయ ఈ వీరభోగ వసంత రాయలు సినిమాలో ఓ కీలకమైన పాత్ర చేస్తున్నట్టు అర్థమౌతోంది. ఇక తెలుగుతో పాటు తమిళ్ లో ఒకటి, హిందీలో ఓ సినిమా చేస్తూ ఇప్పటికీ బిజీగానే ఉన్న ఈ బ్యూటీకి సినిమా పాలిటిక్స్ తరఫు నుంచి హ్యాపీ బర్త్ డే చెప్పేద్దాం.

More Related Stories