English   

రాజ‌మౌళి గ్యారేజ్.. ఇచ్చ‌ట పాత సినిమాలు అమ్మ‌బ‌డును..!

Rajamouli's Magadheera Movie Fantastic Collections in Japan
2018-09-12 06:19:27

ఇప్పుడు రాజ‌మౌళిని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. ఈయ‌న చేసిన సినిమాలు ఇప్పుడే కాదు.. ఎప్పుడు చూసినా కూడా ఫ్రెష్ గా ఉంటాయి. ఇదే రాజ‌మౌళికి.. మిగిలిన ద‌ర్శ‌కుల‌కు ఉన్న తేడా. ఈ తేడా ఏంటో మ‌రోసారి కూడా ప్రూవ్ అయింది. తాజాగా జ‌పాన్ లో మ‌గ‌ధీర విడుద‌ల అయి అక్క‌డ సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ప‌దేళ్లైనా ప‌వ‌ర్ త‌గ్గ‌లేదు ఈ చిత్రానిది. 2009లో వ‌చ్చిన ఈ చిత్రం అప్ప‌ట్లోనే 80 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసి రాజ‌మౌళి రేంజ్ తో పాటు తెలుగు సినిమా స్థాయేంట‌ని బాలీవుడ్ కు కూడా చూపించింది. రాజ‌మౌళి పుణ్య‌మా అని ఇప్పుడు ఈ చిత్రం జ‌పాన్ లో మ‌రోసారి విడుదలైంది. బాహుబ‌లి 2 అక్క‌డ అద్భుత‌మైన విజ‌యం సాధించింది. దాంతో రాజమౌళి బ్రాండ్ కు బాగానే క‌నెక్ట్ అయిపోయారు జ‌ప‌నీయులు.

దాంతో ఈయ‌న గ‌త సినిమాల‌ను అక్క‌డ విడుద‌ల చేస్తున్నారు. జ‌క్క‌న సినిమాల్లో అలా విడుద‌ల చేయ‌గ‌లిగే స‌త్తా ఉన్న సినిమా మ‌గ‌ధీర మాత్ర‌మే. మిగిలినవ‌న్నీ ప‌క్కా మాస్ సినిమాలే. మ‌గ‌ధీర‌లో యుద్ధాలున్నాయి రాజ్యం కోసం పోరాటం ఉంది.. ప్రేమ కూడా ఉంది. ఇవ‌న్నీ ఉన్నాయి కాబ‌ట్టి మ‌గ‌ధీర‌ను ఎంచుకున్నారు. ఆగ‌స్ట్ 31న అక్క‌డ విడుద‌ల చేసారు. అనుకున్న‌ట్లుగ‌డానే ఈ సినిమా అక్క‌డ హిట్ అయింది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా 10 రోజుల్లోనే 18 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది మ‌గ‌ధీర జ‌ప‌నీస్ వ‌ర్ష‌న్. దాంతో జ‌పాన్ ప్రేక్ష‌కుల‌కు త‌న త‌ర‌ఫు నుంచి థ్యాంక్స్ చెప్పాడు చ‌ర‌ణ్. మీ ప్రేమ‌కు ధ‌న్యవాదాలు అంటున్నాడు. అయినా మ‌గ‌ధీర వ‌చ్చి ప‌దేళ్లైంది అని మ‌న‌కు తెలుసు కానీ జ‌పాన్ లో ఎలా తెలుసు..? అందుకే పాపం కొత్త సినిమా అనుకుని చూసేస్తున్నారు.

More Related Stories