English   

అర‌వింద స‌మేత బ్లాక్ బ‌స్ట‌ర్ ఇది ఫిక్స్.. కార‌ణం?

NTR's Aravinda Sametha Will Going to Blockbuster Hit
2018-09-12 06:42:41

కొన్నిసార్లు చావు మంచే చేస్తుంది. దేవుడు ఒక‌టి తీసుకెళ్లినా కూడా ఒక‌టి ఇస్తాడు. ఇప్పుడు నంద‌మూరి కుటుంబం విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. హ‌రికృష్ణ‌ను అర్ధాంత‌రంగా తీసుకెళ్లినా కూడా ఇప్పుడు తెలుగు త‌మ్ముళ్ల‌ను తోడుగా ఎన్టీఆర్ కు ఇచ్చి వెళ్లాడు హ‌ర‌న్న‌. దానికితోడు దూర‌మైన బాబాయ్ ను కూడా ద‌గ్గ‌ర చేసే వెళ్లాడు ఎన్టీఆర్ తండ్రి. ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ కు వెయ్యేనుగుల బ‌లాన్నిస్తుంది. అందుకే విడుద‌ల‌కు ముందే ఓ సినిమాను బ్లాక్ బ‌స్ట‌ర్ అని నిర్ణ‌యిస్తున్నారు అభిమానులు. ఎన్టీఆర్ ఫామ్ లో ఉన్నాడు కాబ‌ట్టి ఖచ్చితంగా ఈ సినిమా కూడా హిట్ అవుతుంద‌ని న‌మ్మడం.. ఆశించ‌డంలో త‌ప్పు లేదు కానీ ఇంత న‌మ్మ‌కంగా చెప్ప‌డం ఏంటని ఆశ్చ‌ర్య‌పోవ‌చ్చు కూడా. దానికి కూడా కార‌ణం లేక‌పోలేదు. కొన్నేళ్లుగా బాల‌య్య అభిమానుల‌తో ఎన్టీఆర్ కు స‌మ‌స్య ఉంది. అందుకే తెలుగుదేశం కూడా ఎన్టీఆర్ సినిమాల‌కు దూరంగా ఉన్నారు.

ద‌మ్ము నుంచి ఇది ఇంకా పెరిగిపోయింది. ఆ సినిమా ఫ్లాప్ కావ‌డంలో కీల‌క‌పాత్ర కూడా తెలుగు త‌మ్ముళ్ల‌దే. కావాల‌నే మెసేజ్ లు పంపి మ‌రీ సినిమాను ఫ్లాప్ చేసార‌నే టాక్ కూడా ఉంది. అప్ప‌ట్నుంచి ఎన్టీఆర్ ప్ర‌తీ సినిమాకు టాక్ నెగిటివ్ గానే వ‌స్తుంది. దీనివెన‌క తెలుగుదేశం హ‌స్తం కూడా ఉంద‌నేది కాద‌న‌లేని స‌త్యం. ఇదంతా బాల‌య్య‌తో ఎన్టీఆర్ కు ఉన్న దూరం వ‌ల్లే. కానీ ఇప్పుడు తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత ఎన్టీఆర్ కు నంద‌మూరి కుటుంబంతో మ‌ళ్లీ బంధం పెరిగిపోయింది. చంద్ర‌బాబునాయుడుతో కూడా సాన్నిహిత్యం వ‌చ్చింది. బాల‌య్య‌తో అయితే బాబాయ్ బాబాయ్ అంటూ వెంటే తిరుగుతున్నాడు. ఇలాంటి స‌మ‌యంలో అర‌విందస‌మేత విడుద‌లకు సిద్ధ‌మ‌వుతుంది. తండ్రి లేడ‌న్న ఒక్క మాట త‌ప్పిస్తే.. అన్నీ ఎన్టీఆర్ కు శుభ‌శ‌కునాలే క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌ట్నుంచి నంద‌మూరి అభిమానుల‌తో పాటు తెలుగు త‌మ్ముళ్ల స‌పోర్ట్ కూడా ఎన్టీఆర్ కు మెండుగా ఉంటుంది. దాంతో అర‌వింద సమేత బ్లాక్ బ‌స్ట‌ర్ అని ముందే ఫిక్సైపోతున్నారు అభిమానులు. త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 10న విడుద‌ల కానుంది.

More Related Stories