English   

సొమ్మొక‌డిది.. సోకు ఇంకొకడిది

Geetha Govindam Success Credit Goes to Vijay Devarakonda Not Parasuram
2018-09-12 07:19:02

ఓ సినిమా హిట్ కావాలంటే ముందు హీరో కాదు కావాల్సింది.. ద‌ర్శ‌కుడు. ఆయ‌నే కెప్టెన్ ఆఫ్ ది షిప్. ఆయ‌న బుర్ర‌లోంచి వ‌చ్చిన ఆలోచ‌నే సినిమా ఫ్యూచ‌ర్ ను నిర్ణ‌యిస్తుంది. కానీ ఇప్పుడు ఈ కెప్టెన్ నే తొక్కేస్తున్నారు మ‌న హీరోలు. త‌మ ఇమేజ్ తో వాళ్ల‌కు పేరు రాకుండా చేస్తున్నారు. అది కావాల‌ని చేస్తున్న‌ది కాదు.. ఆ శృతిలో అలా క‌లిసిపోతుంది అంతే. కావాలంటే చూడండి.. ఇప్పుడు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రికార్డులు తిర‌గ‌రాస్తున్న గీత‌గోవిందం ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ గురించి ఎంత‌మంది అడుగుతున్నారు.. ఎంత‌సేపూ విజ‌య్ అంత.. విజ‌య్ ఇంత‌.. అంటూ హీరో జ‌ప‌మే చేస్తున్నారు కానీ ఒక్క‌డైనా ద‌ర్శ‌కుడు తోపు అంటున్నాడా..? అబ్బో కుర్రాడు కుమ్మేస్తున్నాడు అంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటున్నారు. కానీ ప‌రుశురామ్ ఈ సినిమా కోసం రెండేళ్ల‌కు పైగా క‌ష్ట‌ప‌డ్డాడు.

ఆ క‌ష్టం ఆయ‌న‌కు మాత్ర‌మే తెలుసు. కానీ విడుద‌లైన త‌ర్వాత ఆ క్రెడిట్ అంతా విజ‌య్ ప‌ట్టుకెళ్లిపోయాడు. దీనికి ముందు బాబీ ప‌రిస్థితి కూడా అంతే. జై ల‌వ‌కుశ లాంటి సినిమాను సాధారణంగా ఏ ద‌ర్శ‌కుడైనా హ్యాండిల్ చేయ‌డం చాలా పెద్ద విష‌యం. ఎందుకంటే ఎన్టీఆర్ తో త్రిపాత్రాభిన‌యం చేయించ‌డం అనేది చిన్న విష‌యం కాదు. కానీ బాబీ చేసి చూపించాడు. ఆ సినిమా 75 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేసింది. కానీ ఆ పేరు మాత్రం ఎన్టీఆర్ తీసుకున్నాడు. క్రెడిట్ కోన‌వెంక‌ట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. దాంతో పాపం క‌ష్ట‌ప‌డి క‌థ రాసి సినిమా చేసిన బాబీ మాత్రం అన్యాయం అయిపోయాడు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు చాలానే ఉన్నాయి. సొమ్మొక‌డిది సోకొక‌డిది అంటే ఇదే కాబోలు. ద‌ర్శ‌కులు ఏళ్ల‌కేళ్లు క‌ష్ట‌ప‌డి సినిమాలు చేస్తుంటే.. హీరోలు వాటిని ఒక్క సినిమాతో త‌మ ఖాతాలో వేసుకుంటున్నారు.

More Related Stories