English   

ర‌ష్మిక బ్రేకప్.. విజయ్ దేవరకొండ కారణమా..?

Is Vijay Devarakonada Reason Behind Rashmika Mandanna's Breakup
2018-09-12 08:03:44

సినిమా వాళ్ల బంధాలు నీటిమీద రాత‌లు అని మ‌రోసారి ప్రూవ్ అయింది. ఈ మ‌ధ్య ప్రేమించుకున్న వాళ్లంతా పెళ్లిళ్లు చేసుకుంటుంటే.. అమ్మో మ‌నోళ్లు మారిపోయారు బాబోయ్ అనుకున్నారంతా. కానీ అది నిజం కాదని.. ఒరిజిన‌ల్ లోప‌ల అలాగే ఉంద‌ని ఇప్పుడు మ‌ళ్లీ ర‌ష్మిక మంద‌న్న నిరూపించింది. ఈమె పెళ్లి కూడా పెటాకులు అయిపోయింది. ఏడాది కింద తొలి చిత్ర హీరో ర‌క్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకుంది ర‌ష్మిక‌. క‌న్న‌డ‌లో త‌న‌ను కిరిక్ పార్టీతో ప‌రిచ‌యం చేసి స్టార్ గా మార్చేసిన ర‌క్షిత్ తో ప్రేమ‌లో ప‌డింది ఈ ముద్దుగుమ్మ‌. అంద‌రికీ షాక్ ఇస్తూ 21 ఏళ్ల‌కే అత‌డితో ఏడు అడుగులు న‌డ‌వ‌డానికి ఫిక్స్ అయింది కూడా. అనుకున్న‌దే త‌డువు ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. అయితే అప్పుడు అనుకోలేదు ర‌ష్మిక తాను ఇంత పెద్ద స్టార్ అవుతాన‌ని.. అయింది ఇప్పుడు ఇగోలు మొద‌ల‌య్యాయి.

దాంతో రిలేష‌న్ కాస్తా ఇప్పుడు ప‌నిష్ మెంట్ గా మారింది. దాంతో ర‌క్షిత్ తో బంధాన్ని తెంచేసుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ భామ‌ నిశ్చితార్థం బ్రేక్ అయింద‌ని ర‌ష్మిక త‌ల్లి ప్ర‌క‌టించింది. దాంతో ఇప్పుడు మ‌ళ్లీ సింగిల్ అయిపోయింది ర‌ష్మిక మంద‌న్న‌. ర‌ష్మిక బ్రేకప్ కు ఓ ర‌కంగా విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా కార‌ణ‌మ‌నే అంటున్నాయి క‌న్న‌డ సినీ వర్గాలు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఏదో జ‌రుగుతుంద‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. ఇదే ర‌క్షిత్ ను బాగా డిస్ట‌ర్బ్ చేసింద‌ని.. అది అడిగినందుకే బ్రేక‌ప్ చెప్పేసింద‌నే టాక్ కూడా న‌డుస్తుంది. మ‌రి ఏది నిజ‌మో.. ఏది అబ‌ద్ధ‌మో తెలియ‌దు కానీ ర‌ష్మిక మాత్రం ప్రేమ‌ను తెంచేసుకుంది. ప్ర‌స్తుతం ఈమె తెలుగులో నానితో దేవ‌దాస్.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో డియర్ కామ్రేడ్ సినిమాలు చేస్తుంది.

More Related Stories