English   

అర్జున్ రెడ్డి క‌మెడియ‌న్ విల‌న్ అయ్యాడు.. 

Rahul-Ramakrishna
2018-09-12 10:30:49

క‌మెడియ‌న్లు విల‌న్లు అవుతుంటే చూడ్డానికి భ‌లే ముచ్చ‌ట‌గా ఉంటుంది. సీరియ‌స్ విల‌న్లు చేయ‌డం వాళ్ల‌కు సాహ‌స‌మే. ఎందుకంటే వాళ్ల మొహం చూడగానే న‌వ్వొస్తుంది. అలాంటిది వాళ్లు నెగిటివ్ కారెక్ట‌ర్ చేయ‌డం అనేది మామూలు విష‌యం కాదు. ఈ మ‌ధ్యే గూఢ‌చారిలో వెన్నెల కిషోర్ విల‌న్ రోల్ లో అద్భుతంగా న‌టించాడు. అయితే అది విల‌న్ అని చివ‌రివ‌ర‌కు తెలియ‌దు. ఇక ఇప్పుడు అదే దారిలో మ‌రో క‌మెడియ‌న్ కూడా విల‌న్ పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. అర్జున్ రెడ్డితో పాటు భ‌రత్ అనే నేను.. గీత‌గోవిందం లాంటి సినిమాల‌తో ఫేమ‌స్ అయిన రాహుల్ రామ‌కృష్ణ ఓ త‌మిళ సినిమా చేయ‌బోతున్నాడు. 

కార్తిక్ రాజు అనే కొత్త ద‌ర్శ‌కుడు చేయ‌బోతున్న ఈ చిత్రంలో రాహుల్ విల‌న్ గా న‌టించ‌నున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. క‌థ బాగా న‌చ్చ‌డంతో త‌మిళ ఇండ‌స్ట్రీకి కూడా వెళ్తున్నాడు ఈ కుర్ర క‌మెడియ‌న్. తెలుగులో వ‌ర‌స‌గా ఆఫ‌ర్లు వ‌స్తున్నా కూడా ఓ సారి అర‌వం వైపు కూడా అడుగేద్దామ‌ని చూస్తున్నాడు రాహుల్. మ‌రి మ‌నోడి ల‌క్ అక్క‌డెలా ఉందో చూడాలిక‌. విల‌న్ గా ర‌ప్ఫాడిస్తే ఇక్క‌డ కూడా ఈయ‌న‌లోని విల‌న్ ను చూస్తారు. అన్న‌ట్లు భ‌ర‌త్ అనే నేనులో చాలా సీరియ‌స్ కారెక్ట‌ర్ చేసాడు రాహుల్. అంతే తాను కేవ‌లం క‌మెడియ‌న్ మాత్ర‌మే కాదు అని ఇప్ప‌టికే నిరూపించుకున్నాడు ఈయ‌న‌. దాంతో విల‌న్ రోల్ లో కూడా ఒదిగిపోతాడేమో అనిపిస్తుంది. 

More Related Stories