English   

బాబోయ్.. శైల‌జారెడ్డి అంత తీసుకుందా..? 

Ramya-Krishna
2018-09-12 11:08:15

ఇన్నాళ్ళూ శైల‌జారెడ్డి అంటే ఎవ‌రు అనేవారు.. ఇప్ప‌ట్నుంచి ఓ ర‌మ్యకృష్ణా అంటారు. ఈమె ఏదైనా పాత్ర‌లో న‌టించిందంటే అద‌లా నిలిచిపోతుంది అంతే. ఓ నీలాంబ‌రి అయినా.. ఓ శివ‌గామి అయినా.. ఇప్పుడు శైల‌జారెడ్డి అయినా కూడా. ర‌మ్య‌కృష్ణ అనే పేరు విన‌గానే ఒక‌ప్పుడు స్క్రీన్స్ షేక్ అయిపోయేవి.. బాక్సులు బ‌ద్ద‌ల‌య్యేవి.. త‌న హాట్ గ్లామ‌ర్ షో తో సిల్వ‌ర్ స్క్రీన్ ను వేడెక్కించింది ర‌మ్య‌కృష్ణ‌. 30 ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా ఐటం సాంగ్స్ తో మ‌తులు పోగొట్టింది ర‌మ్య‌. ప్ర‌భాస్, ఎన్టీఆర్ లాంటి కుర్ర హీరోల‌తో కూడా కాలు క‌దిపింది ఈ బ్యూటీ. అయితే ఏ ముద్దుగుమ్మ‌కైనా ఏజ్ లిమిట్ ఉంటుంది. అది దాటిన త‌ర్వాత కూడా గ్లామ‌ర్ షో చేస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ ర‌మ్య‌కృష్ణ విష‌యంలో మాత్రం ఇది మిన‌హాయింపు. ఇప్ప‌టికీ ఈమె హీరోయిన్ లకు ధీటుగానే క‌నిపిస్తుంది. ఇప్ప‌టికీ ఈమె క్రేజ్ చూస్తుంటే పిచ్చెక్కిపోవ‌డం ఖాయం. సినిమాకు కోటికి పైగా తీసుకుని ఇప్ప‌టి స్టార్ హీరోయిన్ల‌కు కూడా షాక్ ఇస్తుంది ఈ ముదురు భామ‌. 

సోగ్గాడే చిన్నినాయ‌నాతో ర‌మ్య‌కృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లైంది. ఆ త‌ర్వాత బాహుబ‌లితో ఈమె జాత‌క‌మే మారిపోయింది. ఇప్పుడు హీరోయిన్ల కంటే ఎక్కువ‌గా సినిమాకు కోటి రూపాయలు తీసుకుంటూ ర‌చ్చ చేస్తుంది ఈ ముదురు ముద్దుగుమ్మ‌. ర‌మ్య‌కృష్ణ‌కు చూసిన వాళ్లెవ‌రూ 50కి చేరువ‌గా ఉంద‌నుకోరు. ప్ర‌స్తుతం శైల‌జారెడ్డి అల్లుడు కోసం నెల రోజుల‌కు గానూ ఏకంగా కోటికి పైగానే రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ట్లు తెలుస్తుంది. ఇందులో నాగ‌చైత‌న్య అత్త‌గా న‌టించింది ర‌మ్య‌కృష్ణ‌. సినిమాల‌తో పాటు మ‌ధ్యలో మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై సూప‌ర్ హాట్ లుక్ తో కేక పెట్టిస్తుంది ర‌మ్య‌కృష్ణ‌. ఇక ఇప్పుడు మ‌రో సినిమాతో కూడా వ‌స్తుంది ఈమె. రాణి శివ‌గామి అంటూ మ‌రో భాష‌లో వ‌చ్చిన సినిమాను ర‌మ్య‌కృష్ణ బొమ్మ చూపించి ఇక్క‌డ అమ్మేస్తున్నారు. ఏదేమైనా 50ల్లోనూ ఇలా ర‌చ్చ చేయ‌డం మాత్రం ర‌మ్య‌కృష్ణ‌కే చెల్లింది.

More Related Stories