English   

పెళ్లిరోజుకు చైతూ గిప్ట్ ఏంటో తెలుసా..? 

Naga-Chaitanya
2018-09-12 14:42:12

చూస్తుండ‌గానే నాగ‌చైత‌న్య‌, స‌మంత పెళ్లి చేసుకుని ఏడాది కావొస్తుంది. అక్టోబ‌ర్ 6తో వీళ్లిద్ద‌రూ ఒక్క‌టై 365 రోజులు గ‌డిచిపోతుంది. అందుకే త‌మ తొలి పెళ్లిరోజు కానుక‌గా భార్య‌కు స‌ర్ ప్రైజ్ ఇవ్వాల‌ని చూస్తున్నాడు చైతూ. దానికి ప్లానింగ్ కూడా సిద్ధ‌మైపోయింది. త‌మ పెళ్లిరోజు నాడే పెళ్లైన త‌ర్వాత తాము క‌లిసి న‌టించ‌బోయే తొలి సినిమాకు ముహూర్తం పెట్ట‌నున్నాడు చైతూ. శివ‌నిర్వాణ తెర‌కెక్కించబోయే ఈ సినిమా అక్టోబ‌ర్ 6న ప‌ట్టాలెక్క‌నుంద‌ని చెప్పాడు చైతూ. ఇదే త‌ను స్యామ్ కు ఇచ్చే గిఫ్ట్ అన్నాడు చైతూ. ఈ సినిమాలో ఇల్లాలే ప్రియురాలు కాబోతుంది. అప్ప‌ట్లో ఇల్లాలు ప్రియురాలు అనే సినిమా ఒక‌టి వ‌చ్చింది. శోభ‌న్ బాబు హీరోగా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఇప్పుడు ఇల్లాలినే ప్రియురాలిగా చేసుకుని నాగ‌చైత‌న్య వ‌స్తున్నాడు.  ఇప్ప‌టికే శివ‌నిర్వాన చెప్పిన క‌థ‌కు ఫిదా అయిపోయాడు చైతూ. పెళ్లికి ముందు నాలుగు సినిమాలు చేసినా కూడా పెళ్ళైన త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి న‌టించ‌బోయే తొలి సినిమా కాబ‌ట్టి అంచ‌నాలు భారీగా ఉంటాయి. నిన్నుకోరి లాంటి సెన్సిబుల్ సినిమా చేసిన శివ‌నిర్వాణ ద‌ర్శ‌కుడు కావ‌డంతో ఆ క్యూట్ నెస్ ఉంటుందని న‌మ్ముతున్నాడు నాగ‌చైత‌న్య‌. నానితో కృష్ణార్జున యుద్ధం సినిమా నిర్మిస్తున్న సాహు గ‌ర్ర‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించ‌నున్నారు. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా.. కోన‌వెంక‌ట్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాస్తున్నాడు. చైతూ ప్ర‌స్తుతం స‌వ్య‌సాచితో పాటు శైల‌జారెడ్డి అల్లుడు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక స‌మంత కూడా రెండు మూడు సినిమాల‌తో బిజీగా ఉంది. దీనికి ప్రేయ‌సి.. శ్రీ‌మ‌తి టైటిల్స్ ప్ర‌చారంలో ఉన్నాయి. మొత్తానికి చూడాలిక‌.. భార్య‌తో క‌లిసి న‌టించ‌బోయే తొలి సినిమా ఎలా ఉండ‌బోతుందో..? 

More Related Stories