English   

ఉత్త‌మ‌ప‌త్ని అవార్డ్ గెలుచుకున్న స‌మంత‌.. 

Chaitanya-samantha
2018-09-12 18:23:53

అవును.. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. మ‌రి త‌న సినిమా.. భ‌ర్త సినిమా ముందు పెట్టి దేనికి నీ ఓటు అంటే భ‌ర్తే నా ప్రాణం అంటుంది స‌మంత‌. ఈ ఇద్ద‌రూ న‌టించిన సినిమాలు సెప్టెంబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాయి. వినాయ‌క‌చ‌వితి కానుక‌గా యు ట‌ర్న్ తో పాటు శైల‌జారెడ్డి అల్లుడు కూడా వ‌స్తున్నాడు. ఈ రెండు సినిమాల‌పై మంచి అంచ‌నాలే ఉన్నాయి. ఎందుకంటే స్టార్స్ ఉన్న సినిమాలు కదా..! స‌మంత కూడా యు ట‌ర్న్ తో 16 కోట్ల బిజినెస్ చేసింది. ఇక చైతూ సినిమా కూడా 28 కోట్ల‌కు పైగానే బిజినెస్ జ‌రిగింది. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో దేనికి మీ ఓటు అని స‌మంత‌ను మీడియా అడిగితే.. మ‌రో ఆలోచ‌న లేకుండా చైతూ విజ‌య‌మే త‌న‌కు ముఖ్య‌మ‌ని చెప్పింది. త‌న భ‌ర్త సినిమా విజ‌యం సాధిస్తే అంత‌కంటే కావాల్సింది ఏముంది అని టిపిక‌ల్ ఇండియ‌న్ వైఫ్ గా మాట్లాడేసింది స్యామ్. భ‌ర్త విజ‌యం కోసం ఏదైనా చేయ‌డానికి సిద్ధ‌మే అంటుంది ఈ భామ‌. మ‌రి యు ట‌ర్న్ ప‌రిస్తితి ఏంటి అంటే.. అది కూడా ఆడాలి. కాక‌పోతే ముందు మాత్రం భ‌ర్త సినిమా ఆడాల‌ని కోరుకుంటున్నాని చెప్పింది స‌మంత‌. త‌న‌కు ఇంత మంచి లైఫ్ ఇచ్చిన చైతూకు విజ‌యం వ‌స్తే చూడాల‌ని ఉంద‌ని చెబుతుంది స‌మంత‌. మ‌రి భార్య కోరిక‌ను నాగ‌చైత‌న్య ఎంత వ‌ర‌కు తీరుస్తాడో చూడాలిక‌..!

More Related Stories