English   

ఇది కదా ఎన్టీఆర్ నుంచి ఎక్స్ పెక్ట్ చేసింది.. 

Aravinda-Sametha
2018-09-12 19:01:17

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ అరవింద సమేత వీరరాఘవ. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇది త్రివిక్రమ్ శైలిలో లేదనే కమెంట్స్ కూడా వచ్చాయి. దీంతో మరో టీజర్ వస్తుందనుకున్నారు. కానీ అలాంటిదేం లేదని చెప్పిన టీమ్.. సడెన్ గా అనుకోని అతిథిలా ఓ అద్భుతమైన స్టిల్ విడుదల చేసింది. అంతే కాదు.. ఈ స్టిల్ తో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కో స్వీట్ న్యూస్ కూడా చెప్పారు.ఈ వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన ఈ స్టిల్ లో యంగ్ టైగర్ ఒక్కడే ఉన్నాడు. లుక్కైతే సూపర్ కూల్ గా చంపేశాడనే చెప్పాలి. బ్లూ డెనిమ్ షర్ట్, గ్రే కలర్ ప్యాంట్ తో చేబులో చేతులు పెట్టుకుని రైట్ ప్రొఫైల్ లో చూస్తోన్న ఈ స్టిల్ చూశాక ఇది కదా త్రివిక్రమ్ నుంచి ఎక్స్ పెక్ట్ చేసింది అనిపించక మానదు. ఇక గతంలో సినిమా పాలిటిక్స్. కామ్ చెప్పినట్టు ఈ మూవీ ఆడియో ను ఈ నెల 20నే విడుదల చేయబోతున్నారు.  విశేషం ఏంటంటే ఆ రోజు అక్కినేని నాగేశ్వరరావు గారి బర్త్ డే. ఆ సందర్భంగా అని చెప్పలేం కానీ.. ఇదేదో కాకతాళీయంగా కలిసొచ్చిన విషయం కావొచ్చు. ఇక తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్లుగా నటిస్తుండగా.. సునిల్, జగపతి బాబు, నాగబాబు, రావు రమేష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆడియోతో పాటు థియేట్రికల్ ట్రైలర్ ను కూడా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ఆ రోజు ట్రైలర్ విడుదల చేస్తారో లేదో తెలియదు కానీ.. ఈ సినిమాను మాత్రం దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల చేయబోతున్నారు.

More Related Stories