English   

‘రానా’ చంద్రబాబు నాయుడు అదిరిపోయాడు

Rana Daggubati Working Stills From NTR Biopic Movie
2018-09-12 23:23:40

కొన్ని కాంబినేషన్స్ ఎక్స్ పెక్ట్ చేయం. అలాగే కొన్ని గెటప్స్ కూడా. ఏ మాత్రం ఊహించలేం. నందమూరి తారకరామారావు బయోపిక్ ‘‘ఎన్టీఆర్’’లో చంద్రబాబు నాయుడుగా రానాను తీసుకున్నప్పుడు చాలామంది రాంగ్ చాయిస్ అనుకున్నారు. కానీ లేటెస్ట్ గా అతని స్టిల్స్ చూసిన ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. అఫ్ కోర్స్ గతంలోనే లీక్ అయిన ఓ ఫోటో చూశాకే వారంతా తమ నిర్ణయాలను మార్చుకున్నారు. నిజానికి రానా పర్సనాలిటీకి, చంద్రబాబు పర్సనాలిటీకి మధ్య చాలా తేడా ఉంది. కానీ ఈ మధ్య హెల్త్ బాలేక రానా బాగా తగ్గాడు. అది ఇప్పుడీ గెటప్ కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఇక లేటెస్ట్ గా అసెంబ్లీ పాయింట్ లో చంద్రబాబు నాయుడు నడిచొస్తోన్న స్టిల్స్ కొన్ని విడుదల చేశారు. ఇందులో రానా పూర్తిగా చంద్రబాబు నాయుడులా మారిపోయాడు. ఈ స్టిల్ చూశాక క్రిష్ సెలెక్షన్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీని వచ్చే యేడాది సంక్రాంతి బరిలో నిలుపేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎన్టీఆర్ గా బాలయ్య నటిస్తోన్న ఈ మూవీలో చాలామంది నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరందరికీ ఇది లైఫ్ టైమ్ మెమరీ అవుతుందని క్రిష్ ముందు నుంచీ చెబుతున్నారు. చివరికి 80యేళ్ల కురువృద్ధుడు సరిగా మాట్లాడలేకపోతున్న.. నాటి తరం నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణతో కూడా ‘హెచ్ఎమ్ రెడ్డి’ పాత్ర చేయించారు. చూస్తోంటే క్రిష్ ఈ చిత్రాన్ని చరిత్రాత్మకంగా మలిచేలా ఉన్నాడు. ఏదేమైనా.. నారా చంద్రబాబు నాయుడును రానా చంద్రబాబుగా మార్చిన రానా టాలెంట్ సూపర్బ్ అంతే.

More Related Stories