English   

చిరు రికార్డును కూడా వదల్లేదు విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Vijay Devarakonda Beats Chiranjeevi Khaidi No 150 Record
2018-09-13 06:04:43

తెలుగు ఇండ‌స్ట్రీలోనే టాప్ హిట్స్ లో ఒక‌టి సొంతం చేసుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అర్జున్ రెడ్డితో పాత్ బ్రేకింగ్ సినిమా ఇచ్చి చ‌రిత్ర సృష్టించిన ఈ కుర్ర హీరో.. ఇప్పుడు క‌లెక్ష‌న్ల వైజ్ గా కూడా చ‌రిత్ర సృష్టిస్తున్నాడు. ఒక‌టా రెండా ఏకంగా 120 కోట్ల మార్క్ అందుకున్నాడు విజ‌య్. ఈయ‌న న‌టించిన గీత‌గోవిందం ఇప్ప‌టికీ దుమ్ము దులిపేస్తూనే ఉంది. ఇప్ప‌టికే దూకుడు.. రేసుగుర్రంతో పాటు చాలా సినిమాలు క్రాస్ చేసింది ఈ సినిమా. ఇప్పుడు ఖైదీ నెం.150 రికార్డుల‌ను సైతం దాటేసింది ఈ సినిమా. ఓవ‌ర్సీస్ లో 2.44 మిలియ‌న్ తో ఖైదీ నెం.150 రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు 2.44 మిలియ‌న్ దాటేసి ఖైదీ కంటే మ‌రో ప‌ది ల‌క్ష‌ల డాల‌ర్లు ఎక్కువే తీసుకొచ్చింది ఈ చిత్రం. దాంతో చిరంజీవి రికార్డును సైతం గీత‌గోవిందం వద‌ల్లేదు. విడుద‌ల నాలుగు వారాల త‌ర్వాత కూడా ఈ సినిమా దూకుడు త‌గ్గడం లేదు.

ఇప్ప‌టికీ చాలా చోట్ల హౌజ్ ఫుల్స్ బోర్డులు క‌నిపిస్తున్నాయి. అస‌లు ఈ చిత్ర దూకుడు చూసి ట్రేడ్ పండితుల‌కు కూడా బుర్ర హీట్ ఎక్కిపోతుంది. పైగా ఈ సినిమాకు చాలా మంది హీరోలు.. చిన్న సినిమాలు కూడా బ‌లైపోయాయి. అందులో నాగ‌శౌర్య న‌ర్త‌న‌శాల కూడా ఉంది. ఇప్ప‌టికే 26 రోజుల్లో 67 కోట్ల‌ షేర్ వ‌సూలు చేసి.. 121 కోట్ల గ్రాస్ ఖాతాలో వేసుకున్నాడు విజ‌య్ దేవ‌రకొండ‌. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే షేర్ 47 కోట్ల‌కు చేరింది. ఇక యుఎస్.. క‌ర్ణాట‌క‌.. త‌మిళ‌నాడు.. కేర‌ళ‌.. ఇలా ఏ ప్లేస్ చూసినా ఇప్పుడు గీత‌గోవిందం త‌ప్ప మ‌రో సినిమా క‌నిపించ‌డం లేదు. సెప్టెంబ‌ర్ 13న శైల‌జారెడ్డి అల్లుడు.. యు ట‌ర్న్ వ‌చ్చినా కూడా శైల‌జారెడ్డి ఐదో వారంలో కూడా త‌న హ‌వా చూపించేలా ఉంది. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్ర ఫైన‌ల్ ర‌న్ ఎక్క‌డివ‌ర‌కు వ‌చ్చి ఆగుతుందో..?

More Related Stories