English   

మహేష్ కు కూడా ప్ర‌భాస్ క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు

Mahesh Babu Prabhas
2018-09-13 06:53:38

హీరోలెవ‌రైనా ఇప్పుడు చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. ఓవ‌ర్సీస్ షూటింగ్ లు పెట్టుకోవాలంటే ఒక్కొక్క‌రికి వ‌ణుకు వ‌స్తుందిప్పుడు. కేవ‌లం వాటి వల్లే షూటింగులు కూడా ఆల‌స్యం అవుతున్నాయి. మొన్నామ‌ధ్య అఖిల్ సినిమాకు.. దానికి ముందు ప్ర‌భాస్ సాహో సినిమాకు ఫారెన్ షూటింగ్ కు వెళ్ల‌డానికి చాలా చుక్క‌లే క‌నిపించాయి. దానికి కార‌ణం ఒకేసారి క్రూ ను త‌మ‌తో పాటు విదేశాల‌కు తీసుకెళ్లడం. విసా అంద‌రికీ ఒకేసారి ఇష్యూ చేయాలంటే లేనిపోని ప్రాబ్ల‌మ్స్ వ‌స్తున్నాయి. అంద‌రికీ అన్నీ క‌రెక్ట్ గా ఉండ‌టం లేదు. దాంతో ఎవ‌రో ఒక‌రికి విసాలు ఇబ్బంది అవుతూనే ఉన్నాయి. ఒకేసారి అంత‌మందికి వీసాలు ఏర్పాటు చేయ‌డం క‌ష్టంగా మారుతుంది. సాహో షూటింగ్ కేవ‌లం వీసాలు ఆల‌స్యం కావ‌డం వ‌ల్లే నెల రోజులకు పైగా షెడ్యూల్ లేట్ అయింది.

ఇక అఖిల్-వెంకీ అట్లూరి సినిమాకు సైతం ఈ తిప్ప‌లు త‌ప్ప‌లేదు. నెల రోజుల త‌ర్వాత లండ‌న్ వెళ్లారు చిత్ర‌యూనిట్. ఎన్టీఆర్ నాన్న‌కు ప్రేమతో టైమ్ లోనూ ఇదే తిప్ప‌లు. ఇప్పుడు మహేష్ మ‌హ‌ర్షికి కూడా వీసా స‌మ‌స్య‌లే వ‌స్తున్నాయి. వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ యుఎస్ లోనే ఎక్కువ భాగం జ‌ర‌గ‌నుంది. భారీ షెడ్యూల్ ఒక‌టి అక్క‌డే ప్లాన్ చేసాడు ద‌ర్శ‌కుడు వంశీ. ఇప్ప‌టికే అత‌డు అక్క‌డికి వెళ్లి లొకేష‌న్లు కూడా ఫైన‌ల్ చేసుకుని వ‌చ్చాడు. ఇక్క‌డ షూటింగ్ అయిన త‌ర్వాత అక్క‌డికి వెళ్లాల‌నేది వంశీ ప్లాన్. అయితే ఇప్పుడు వీసా కార‌ణంగా ఇది ఆలస్య‌మ‌య్యేలా క‌నిపిస్తుంది. ఒకేసారి త‌న అసిస్టెంట్స్ తో పాటు టెక్నీషియ‌న్స్ కూడా భారీగా వ‌స్తుండ‌టంతో అంద‌రికీ వీసాలు అంటే క‌ష్ట‌మైపోతుంది. అందుకే అనుకున్న టైమ్ కు ఈ షెడ్యూల్ మొద‌ల‌వ్వ‌డం అనుమానంగానే ఉంది. ఏప్రిల్ 5, 2019న విడుద‌ల కానుంది మ‌హ‌ర్షి.

More Related Stories