English   

శైల‌జారెడ్డి అల్లుడు రివ్యూ 

Sailaja-Reddy-Alludu
2018-09-13 07:49:08

ప్రేమ‌మ్ త‌ర్వాత నాగ‌చైత‌న్య క‌థ‌ల ఎంపిక‌లో చాలా తేడాలు వ‌చ్చాయి. త‌న ఫిజిక్ కు ఇమేజ్ కు త‌గ్గ క‌థ‌లు సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ క్ర‌మంలోనే కంప్లీట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్ గా శైల‌జారెడ్డి అల్లుడు సినిమా చేశాడు. ఫ‌స్ట్ టైమ్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో చైతూ న‌టించిన ఈ సినిమా ప్రోమోస్, ట్రైల‌ర్స్ తో ఇంప్రెసివ్ గానే ఉంది. ముందు నుంచీ ఈ మూవీ సూప‌ర్ హిట్ గ్యారెంటీ అనే ఫీల‌ర్స్ వ‌దులుతున్నారు. మ‌రోవైపు చైతూ భార్య స‌మంత కూడా యూ ట‌ర్న్ తో ఇవాళ థియేట‌ర్స్ కు వ‌చ్చింది. మ‌రి ఈ ఇద్ద‌రిలో చైతూ సినిమా ఎలా ఉందీ అనేది ఇప్పుడు చూద్దాం..

క‌థ   

చైత‌న్య‌(నాగ‌చైత‌న్య‌)ది హ్యాపీ ఫ్యామిలీ. కానీ అత‌ని తండ్రి చాలా ఈగోయిస్ట్. యార‌గెంట్ కూడా. తండ్రితో పాటే వారి సొంత కంపెనిలో మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేస్తుంటాడు చైతూ. ఈ క్ర‌మంలో అనూ(అనూ ఇమ్మానుయేల్)తో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. కానీ అనూ తండ్రి కంటే ఎక్కువ ఈగోయిస్ట్. ఏం చేసినా త‌న‌దే పై చేయి ఉండాల‌ని.. త‌న‌కంటే ఎవ‌రూ ఎక్కువ కాద‌నుకునే మ‌న‌స్త‌త్వం. అలాంటి అనూను ఎలాగోలా తంటాలు ప‌డి ప్రేమ‌లో ప‌డేస్తాడు చైతూ.  ఇద్దరూ ల‌వ్ క‌న్ఫర్మ్  చేసుకున్న టైమ్ లో చైతూ తండ్రి ఇద్ద‌రినీ చూస్తాడు. త‌న‌కు తెలియ‌కుండా ప్రేమించిన కొడుకుపై మండి ప‌డ‌తాడు. త‌న కాళ్ల‌పై ప‌డి ఆ అమ్మాయి అడిగేతేనే ఈ పెళ్లికి ఒప్పుకుంటా అంటాడు. అందుకు అనూ ఒప్పుకోదు. ఇది బాగా నచ్చిన చైతూ ఫాద‌ర్ ఆ అమ్మాయే త‌న కోడ‌లు అని చెబుతాడు. ఈ క్ర‌మంలో కాస్త అత్యుత్సాహానికి పోయి త‌న ఈగోను చ‌ల్ల‌బ‌రుచుకోవ‌డానికి బ‌ల‌వంతంగా ఈ ఇద్ద‌రికీ ఎంగేజ్మెంట్ చేస్తాడు. అనూ త‌ల్లి వ‌రంగ‌ల్ లో పెద్ద పొలిటీషియ‌న్,. ఆడ‌వారికి ఏ ఆప‌ద వ‌చ్చినా వాలిపోతుంది. అలాంటి ఆమెకు తెలియ‌కుండా కూతురుకు ఎంగేజ్మెంట్ జ‌రిగితే త‌ర్వాత ప‌ర్య‌వ‌స‌నాలు ఏంటీ..? త‌న తండ్రి, ల‌వ‌ర్ కంటే ఎక్కువ ఈగోయిస్ట్ అయిన శైల‌జారెడ్డిని ఒప్పించి చైతూ ఎలా త‌న ప్రేమను ద‌క్కించుకున్నాడ‌నేది క‌థ‌.

విశ్లేష‌ణ‌:

మారుతి మార్క్ ఎంట‌ర్టైన్మెంట్ గ్యారెంటీ అంటూ వ‌చ్చిన సినిమా శైల‌జారెడ్డి అల్లుడు. నిజ‌మే.. ఆ మార్క్ కు కొర‌త లేదు కానీ.. ఎటొచ్చీ అది మ‌రీ పాత‌ది. సినిమా చూస్తున్నంత సేపూ ఎక్క‌డా మీట‌ర్ త‌గ్గ‌కుండా ఓ గీత గీసిన‌ట్టుగా.. అది దాట కూడ‌దు అన్న‌ట్టుగా సాగే క‌థ‌నం ఏ మాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపించ‌దు. అలాగ‌ని మరీ బోర్ కొట్ట‌దు. బ‌హుశా దీన్నే మారుతి మార్క్ అనాలేమో. ఓ అమ్మాయిని ప్రేమించిన కుర్రాడు.. త‌న ప్రేమ‌కోసం చాలా క‌ష్టాలు ప‌డ‌టం.. త‌ను ప్రేమ‌లో ప‌డ‌క‌పోయేస‌రికి త‌న వ్య‌క్తిత్వానికి భిన్నంగా వెళ్లి ముగ్గులోకి దించ‌డం.. ఇదంతా సాగి హీరోయిన్ ఉన్న‌ది హీరోతో ప్రేమ‌లో ప‌డేందుకే అన్న ఫార్ములా దాట‌కుండా ఇంట‌ర్వెల్ వ‌ర‌కూ ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ‌టం. అంతా స‌జావుగా సాగుతోంది అనుకుంటోన్న టైమ్ లో కొన్ని ప్రేమ వ్య‌తిరేక శ‌క్తులు ఎంట‌ర్ కావ‌డం.. అటుపై మ‌ళ్లీ త‌న ప్రేమ‌ను గెలిపించుకునేందుకు హీరో నానా తంటాలు ప‌డ‌టం.. పాత్ర‌లు, క‌థ‌నాలు కాస్త అటూ ఇటైనా ఇదే ఫార్ములాలో సాగిన సినిమా శైలజారెడ్డి అల్లుడు. క‌థేమీ కొత్త‌ది కాదు. క‌థ‌న‌మూ అంతే. కాక‌పోతే మ‌రీ బోరింగ్ అనేలా కాకుండా త‌న‌దైన శైలి ఎంట‌ర్టైన్మెంట్ తో లాగించే ప్ర‌య‌త్నం చేశాడు మారుతి. ఇందుకు వెన్నెల కిశోర్, ప్రుథ్వీరాజ్ ల‌ను బాగ వాడుకున్నాడు. ఫ‌స్ట్ హాఫ్ అంతా అనూను ప్రేమ‌లో ప‌డేయ‌డానికి చైతూ ఏం చేశాడ‌నేది చూపిస్తే.. సెకండ్ హాఫ్ అంతా శైల‌జరెడ్డి ని మోసం చేసి ఆ ఇంట్లో పాగా వేసి.. ఎలాగైనా మంచి టైమ్ చూసి అనూతో త‌మ పెళ్లి గురించి మాట్లాడించాల‌నుకుంటాడు హీరో. ఇందుకోసం క‌థ‌ను హైద‌రాబాద్ నుంచి వ‌రంగ‌ల్ కు తీసుకువ‌చ్చాడు. కానీ ఇక్క‌డ ఒక్క‌రూ ఆ స్లాంగ్ మాట్లాడ‌రు. అదేంటో మ‌రి. ఇదంతా కాస్త అటూ ఇటూగా ద‌శాబ్ధానికి పైగా వ‌స్తోన్న కామెడీనే. ఇప్ప‌టికే ఈ టైప్ఎంట‌ర్టైన్మెంట్ కు కాలం చెల్లింది అని ప్రేక్ష‌కులు ఎప్పుడో డిసైడ్ అయ్యారు. మ‌ళ్లీ అలాంటి క‌థ‌తోనే మారుతి చైత‌న్యను ఒప్పించ‌డం గొప్ప విష‌య‌మే.  అక్క‌డ‌క్క‌డా కొన్ని న‌వ్వులు త‌ప్ప‌.. నిజంగా న‌వ్వించే సీన్స్ త‌క్కువ‌. 

సెకండ్ హాఫ్ విష‌యంలో ద‌ర్శ‌కుడు మ‌రింత జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సింది. ఎంత సేపూ శైల‌జ‌కు భ‌య‌ప‌డే, లేదా భ‌య‌పెట్టే సీన్స్ త‌ప్ప‌.. ఆమెలోని మ‌రో కోణం గురించి ద‌ర్శ‌కుడు చ‌ర్చించిందే లేదు. ర‌మ్య‌క్రుష్ణ శైల‌జారెడ్డిగా అద‌ర‌గొట్టింది. కానీ ఆ పాత్ర‌లో అంత‌కు మించి వేరియేష‌న్స్ చూపించ‌డానికి లేదు. అన్న‌ట్టుగా మ‌ళ్లీ పాత‌కాలం క‌థ‌కే ప‌ట్టం క‌ట్టాడు మారుతి. అటు ఆమె భ‌ర్త పాత్ర‌లోనూ ఏ కొత్త‌ద‌న‌మూ లేదు. ఎస్వీ రంగారావు నుంచి వ‌స్తున్న భ‌ర్త పాత్రే. మొత్తంగా పండ‌గ సీజ‌న్ లో ఎలాగైనా నెట్టుకొస్తుంద‌నుకున్నారేమో కానీ.. నిజానికి క‌థ‌, క‌థ‌నాల ప‌రంగా చూస్తే శైల‌జారెడ్డి అల్లుడు ఏమంత గొప్ప‌గా లేదు. న‌టుడుగా నాగ చైత‌న్య‌లో కొంత ప‌రిణతి క‌నిపిస్తుంది. కానీ డైలాగ్ డెలివరీ మాత్రం ఇప్ప‌ట్లో బాగ‌య్యేలా లేదు. అనూ ఇమానుయేల్ బాగా చేసింది. ఆ పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా సెటిల్డ్ గా ఉంది. ముర‌ళీ శ‌ర్మ పాత్ర కాస్త అతిగా అనిపించినా.. ద‌ర్శ‌కుడు అతికించే ప్ర‌య‌త్నం చేశాడు. వెన్నెల కిశోర్, ప్రుథ్వీ, న‌రేష్‌, ఫిదా శ‌రణ్య‌ల పాత్ర‌లు ఆక‌ట్టుకుంటాయి. ఫైన‌ల్ గా మారుతి మార్క్ ఎంట‌ర్టైన‌రే. కానీ కొత్త‌గా లేదు. 

టెక్నిక‌ల్ గా :

గోపీ సుంద‌ర్ సంగీతం బావుంది. నేప‌థ్య సంగీత‌మూ బావుంది. కొన్ని పాట‌లు విజువ‌ల్ గా బావున్నాయి. సినిమాటోగ్ర‌ఫీ హైలెట్. మాట‌లు జ‌స్ట్ ఓకే.. సెట్, ఆర్ట్ వ‌ర్క్స్ ఆక‌ట్టుకుంటాయి. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ఫైట్స్ ఒకే. 

ప్ల‌స్ పాయింట్స్    

ఫ‌స్ట్ హాఫ్ 
కామెడీ
సంగీతం
సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్ 

క‌థ‌
క‌థ‌నం
సెకండ్ హాఫ్ 
క్లైమాక్స్ 

ఫైన‌ల్ గా - శైలజారెడ్డి అల్లుడు పాత‌వాడే 

రేటింగ్    - 3.25/5

More Related Stories