English   

మామా అల్లుళ్ల పోస్టర్ అద్భుతం

Balakrishna as NTR Rana as Chandrababu Naidu Poster Released From NTR Biopic
2018-09-13 15:08:21

నంద‌మూరి తార‌క‌రామారావు బ‌యోపిక్ తెర‌కెక్కుతుంది అన్న ద‌గ్గ‌ర్నుంచీ ఈ  సినిమాపై ప‌రిశ్ర‌మ‌తో పాటు రాజ‌కీయ‌వ‌ర్గాల్లోనూ భారీ ఆస‌క్తి నెల‌కొంది. చాలా మంది ఈ సినిమా అప్డేట్స్ గురించి ఎప్ప‌టిక‌ప్పుడు ఆరాలు తీస్తూనే ఉన్నారు. మొద‌ట్లో పెద్ద‌గా క్రేజ్ లేదు కానీ.. ఎప్పుడైతే ద‌ర్శ‌కుడు క్రిష్ ప్రాజెక్ట్ లోకి ఎంట‌ర్ అయ్యాడో అప్ప‌టి నుంచీ ఎన్టీఆర్ పై భారీ అంచ‌నాలు కూడా పెరిగాయి. వాటిని ఇంకా పెంచుతూ క్రిష్ ఎప్ప‌టిక‌ప్పుడూ కొత్త స్టిల్స్, ఇత‌ర ఆర్టిస్టుల సెలెక్ష‌న్ తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూనే ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా వ‌దిలిన ఓ స్టిల్ మాత్రం అద్భుతం అనే చెప్పాలి. ఇప్ప‌టి వ‌రకూ వ‌చ్చిన స్టిల్స్ కంటే ఇది మ‌రీ హైలెట్ గా ఉంది. కారణం.. టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న బాల‌య్య‌.. చంద్ర‌బాబుగా న‌టిస్తోన్న రానా.

మామా అల్లుళ్లుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో వీరికి ఉన్న ఇమేజ్ ను ప‌క్క‌న బెడితే సినిమాటిక్ గా మాత్రం ఈ స్టిల్ అపూర్వం అనే చెప్పాలి. నాటి తార‌క‌రాముడు మ‌ళ్లీ వ‌చ్చాడా అన్న‌ట్టుగా ఉంది బాల‌య్య ఆహార్యం. అచ్చంగా ఎన్టీఆరే దిగివ‌చ్చి చంద్ర‌బాబు నాయుడుతో మాట్లాడుతున్నాడా అన్న‌ట్టుగా.. ఉన్న ఈ పోస్ట‌ర్ ఈ వినాయ‌క చ‌వితికి బాల‌య్య అండ్ తెలుగుదేశం పార్టీ వ‌ర్గాల్లో ఉత్సాహాన్ని పెంచింద‌నే  చెప్పాలి. చంద్ర‌బాబు పాత్ర‌లో న‌టిస్తోన్న రానా గెట‌ప్ కు కూడా రీసెంట్ గా అద్భుత‌మైన అప్లాజ్ వ‌చ్చింది. ఇత‌ర పాత్ర విష‌యంలోనూ క్రిష్ ఇంతే ప‌ర్ఫెక్ట్  అవుట్ లుక్ తీసుకుంటున్న‌ట్టు ప్ర‌తిసారీ తెలుస్తూనే ఉంది.

ఏదేమైనా ఈ మామా అల్లుళ్ల స్టిల్.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది సినిమా అండ్ పాలిటిక్స్ అయింది. సంక్రాంతి బ‌రిలో విడుద‌ల కాబోతోన్న ఎన్టీఆర్ సినిమా కోసం ఇప్ప‌టి నుంచే ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు జ‌నం. మొద‌ట్లో ఈ పాత్ర‌కు బాల‌య్య సూట్ కాడేమో అనుకున్న‌వారికి కూడా ఇప్పుడు ఆయ‌న త‌ప్ప వేరే ఆప్ష‌న్ లేదు అనేలా తీర్చిదిద్దారా ఆహార్యాన్ని. ఏదేమైనా బాల‌య్య ముందు నుంచీ చెబుతున్న‌ట్టు ఈ చిత్రంతో చ‌రిత్ర సృష్టించడం ఖాయంగా క‌నిపిస్తోంది.

More Related Stories