English   

నాని-నిత్యా మ‌ళ్లీ క‌లుస్తున్నారా..?

Nani-Nithya
2018-09-13 17:05:06

నాని-నిత్యామీన‌న్.. చేసింది రెండు సినిమాలే అయినా కూడా ఎన్నో సినిమాలు చేసిన‌ట్లు అనిపిస్తుంది. వాళ్ల జోడీ స్క్రీన్ పై చేసిన మ్యాజిక్ అలా ఉంది మ‌రి. కెరీర్ కొత్త‌లో ఇద్ద‌రికి ఒకేసారి బ్రేక్ వ‌చ్చింది. అలా మొద‌లైంది సినిమాతో నాని సూప‌ర్ హిట్ అందుకున్నాడు. అదే సినిమాలో నిత్యా త‌న న‌ట‌న‌తో మాయ చేసింది. ఈ ఇద్ద‌రి జోడీకి అప్ప‌ట్లో ప్ర‌శంస‌లు కూడా వ‌చ్చాయి. భలే న‌టించారే అన‌కుండా ఇద్ద‌రూ భ‌లేగా ఉన్నారే అన్నారు చాలా మంది. ఆ త‌ర్వాత అదే క్రేజ్ ఉంటుంద‌ని సెగ సినిమాలో క‌లిసి న‌టించారు. కానీ అది కాస్తా డిజాస్ట‌ర్ అయింది. అయితే ఇప్పుడు ఇన్నేళ్ల‌కు మ‌ళ్లీ ఈ ఇద్ద‌రూ క‌లిసి న‌టించ‌బోతున్నార‌ని తెలుస్తుంది.  నాని ప్ర‌స్తుతం గౌత‌మ్ తిన్ననూరి ద‌ర్శ‌క‌త్వంలో జెర్సీ సినిమా చేస్తున్నాడు. ఇందులో క్రికెట‌ర్ గా న‌టిస్తున్నాడు న్యాచుల‌ర్ స్టార్. ఈ మ‌ధ్యే నాగ‌శౌర్య నర్త‌న‌శాల‌లో న‌టించిన కాష్మీర్ ప‌ర్దేశీని ఇందులో హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక ఇప్పుడు మ‌రో హీరోయిన్ గా నిత్యామీన‌న్ ను తీసుకున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ ఇద్ద‌రి జోడీకి ఉన్న క్రేజ్ వాడుకోవాల‌ని చూస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. దీనికి నిత్యామీన‌న్ కూడా సై అనేసింద‌ని తెలుస్తుంది. ఈ మ‌ధ్యే నాని నిర్మించిన అ.. సినిమాలో కూడా న‌టించింది నిత్యా. ఇప్పుడు మ‌రోసారి క‌లిసి న‌టించ‌బోతున్నారు ఈ జోడీ. మ‌రి మూడోసారి ఈ జంట క‌లిసి చేసే మాయాజాలం ఎలా ఉండ‌బోతుందో..? 

More Related Stories