English   

ఎన్టీఆర్ కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి భయపడ్డాడా..?

Yatra-Release
2018-09-13 18:04:34

యాత్ర.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ లాంటి సినిమా. బయోపిక్ లాంటి అని ఎందుకు అన్నామో అందరికీ తెలుసు. ఎందుకంటే ఇది పూర్తిగా వైఎస్ జీవితావిష్కణతో వస్తోన్న సినిమా కాదు. ఆయన పాదయాత్ర ద్వారా ఎలా అధికారంలోకి వచ్చారు. అంతకు ముందు ప్రతిపక్ష నేతగా ఎలా ఉన్నారు.. వంటి విషయాలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అందువల్ల ఆయన చిన్నతనం నుంచి అంటూ ఓ లాంగ్ స్టోరీ ఏమీ ఉండదు. ఇక మమ్మూట్టి వైఎస్ పాత్రలో నటిస్తున్నప్పుడే చాలామంది ఇది ఖచ్చితంగా పాజిటివ్ టాక్ తెచ్చుకునే సినిమా అవుతుంది అనుకున్నారు. గతంలో పాఠశాల, ఆనందో బ్రహ్మ.. వంటి సినిమాలతో ఆకట్టుకున్న మహి వి రాఘవ స్వీయదర్శకత్వంలో(మరికొందరు నిర్మాతలు కూడా ఉన్నారు) రూపొందుతోన్న సినిమా ఇది.

ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుందని చెబుతున్నారు. రీసెంట్ గా వచ్చిన పాట కూడా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలపాలనుకున్నారు మేకర్స్. కానీ ఇప్పుడు ప్రీ పోన్ చేసుకున్నారు. అంటే ఇంకా ముందుగానే వస్తున్నారు. నిజానికి సంక్రాంతి బరిలో ‘ఎన్టీఆర్’ సినిమా ఉంది. నందమూరి తారకరామారావు బయోపిక్ అన్నమాట. బాలయ్య ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ మూవీపై రోజు రోజుకూ విపరీతమైన క్రేజ్ పెంచుతున్నారు. కానీ ఇటు యాత్ర విషయంలో మమ్మూట్టి తప్ప మరో క్రేజీ ఆర్టిస్టే కనిపించడం లేదు. అలాగని సినిమా రిజల్ట్ గురించి మనం మాట్లాడ్డం లేదు. బట్.. కనీసం ఓపెనింగ్స్ అయినా తేవాలి. లేదా పోటీలో నిలబడ్డప్పుడు గట్టిగా ఢీ కొట్టాలి. చూస్తుంటే యాత్రలో ఆ గట్టిదనం లేదనిపిస్తోంది. అందుకే సంక్రాంతి నుంచి డిసెంబర్ కు వచ్చారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బర్త్ డే అయిన డిసెంబర్ 21న యాత్రను విడుదల చేస్తున్నామని ప్రకటించారు. జగన్ బర్త్ డే అని చెప్పినా అసలు మేటర్ అదే అని ఎవరైనా ఊహించేయగలరు.

ఇక విశేషం ఏంటంటే.. అదే రోజు ఇద్దరు యంగ్ స్టర్స్ నటించిన రెండ క్రేజీ మూవీస్ కూడా బరిలో ఉన్నాయి. శర్వానంద్, సాయి పల్లవి జంటగా హను రాఘవపూడి డైరెక్షన్ లో రూపొందుతోన్న ‘పడిపడి లేచెను మనసు’తో పాటు వరుణ్ తేజ్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో వస్తోన్న ‘అంతరిక్షం’ కూడా డిసెంబర్ 21నే విడుదల కాబోతున్నాయి. మరి ఈ యంగ్ స్టర్స్ మధ్యలో ’యాత్ర’ బాక్సాఫీస్ రూట్ లో సజావుగా సాగుతుందో లేదో చూడాలి. 
 

More Related Stories