English   

అల్లు అర్జున్ అక్కడ సూపర్ హిట్టంట

Naa-peru-surya
2018-09-13 18:46:44

కొన్నిసార్లు ఆడియన్స్ టేస్ట్ లు ఆశ్చర్యం కలిగిస్తాయి. అయితే ప్రాంతాలను బట్టి వారి టేస్ట్ లో మార్పులుంటాయి. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ ‘ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఏంటీ కేరళలో అనుకుంటున్నారు కదూ.. కాదు.. బాలీవుడ్ లో. యస్.. రీసెంట్ గా ఈ మూవీ డబ్బింగ్ వెర్షన్ హిందీలో విడుదలైంది. ఆశ్చర్యంగా ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయట. ఈ విషయాన్ని మూవీ ఎగ్జిబిటర్ అక్షయ్ రతి ట్వీట్ చేయడం విశేషం. 

వక్కంతం వంశీ మొదటిసారిగా మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన ఈ మూవీ తెలుగులో ఫ్లాప్ గా నిలిచింది. అలాగే మళయాలంలో కూడా యావరేజ్ గానే ఆడింది. కానీ ఊహించని విధంగా బాలీవుడ్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం. ఇదే ఆడియన్స్ టేస్ట్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేకపోవడానికి ఓ ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక ఈ మూవీ హిందీలో ‘సూర్య ద సోల్జర్’గా విడుదలైంది. నిజానికి ఈ మూవీ అక్కడ హిట్ కావడానికి కారణాలూ లేకపోలేదు.

హిందీ ఆడియన్స్ కు యాక్షణ్ సినిమాలంటే బాగా ఇష్టం. బన్నీ సినిమాలకు అక్కడ మంచి క్రేజ్ ఉంది. అలాగే బాలీవుడ్ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బొమన్ ఇరానీ ఉన్నాడు. మరోవైపు యాక్షన్ సినిమాలతో గతంలోనే హిందీలోనూ గుర్తింపు తెచ్చుకు యాక్షన్ కింగ్ అర్జున్ ఫోటో కూడా పోస్టర్ లో స్ట్రాంగ్ గా వేశారు. దీంతో ఆటోమేటిక్ గా కలెక్షన్స్ పెరిగాయని చెప్పొచ్చు. అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ సాంగ్స్ కు కూడా అక్కడ మంచి రెస్పాన్స్ వస్తుండటం విశేసం. మొత్తంగా తెలుగులో ఫ్లాప్ అయినా అల్లు అర్జున్ మూవీ అక్కడ సూపర్ హిట్టవడం విశేషమే. 

More Related Stories