English   

రామ్ టీజర్ హాట్ గా ఉందట

Hello-Guru-Prema-Kosame
2018-09-13 18:56:02

రామ్ పోతినేని.. ఓ హిట్ కోసం చకోర పక్షిలా చూస్తున్నాడు. ఎనర్జిటిక్ స్టార్ గా పేరున్నా కథల విషయంలో ఆ ఎనర్జీ చూపించలేక చతికిలపడుతున్నాడు రామ్. రీసెంట్ గా వచ్చిన ఉన్నది ఒకటే జిందగీపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఆ సినిమా ఫస్ట్ హాఫ్ కే ఫ్లాప్ అని తేలిపోయింది. ఈ నేపథ్యంలో దిల్ రాజు బ్యానర్ లో ఫస్ట్ టైమ్ యాక్ట్ చేస్తున్నాడు. తనకు తోడు మరో ఫ్లాప్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తోన్న ఈ మూవీకి ‘హలోగురూ ప్రేమకోసమే’ అనే క్యాచీ టైటిల్ పెట్టి ఆకట్టుకున్నారు. ఇక మినిమం గ్యారెంటీ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ నుంచి వినాయక చవితి స్పెషల్ గా ఓ పోస్టర్ విడుదల చేశారు. వర్షంలో రామ్ గొడుకు పట్టుకుని వెళుతుంటే ఆ వెనకే అనుపమా ఆ రెయిన్ ను ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం తెలుగులో కొత్త తరహా చిత్రాలకు ఆదరణ ఎక్కువగా ఉంది. మరి ఇది ఏ తరహా సినిమాగా వస్తుందో కానీ.. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ఇక పండగ సందర్భంగా పోస్టర్ తో పాటు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వదిలారు. ఈ నెల 17న  ‘హలోగురూ ప్రేమకోసమే’ టీజర్ విడుదల చేయబోతున్నారు. ఈ పోస్టర్ ను ట్వీట్ చేసిన రామ్ ‘ టీజర్ హాట్ గా ఉంది.. ఈ నెల 17న వస్తోంది’ అంటూ క్యాప్షన్ పెట్టడం విశేషం. అంటే ఈ పోస్టర్ కూల్ గా ఉన్నా టీజర్ హాట్ గా ఉంటుందనే ఇండికేషన్ ఇచ్చాడన్నమాట. మరి అదెంత హాట్ గా ఉందో మనమూ చూస్తాంగా.. 
 

More Related Stories