English   

 సిక్స్ ప్యాక్ తో షాక్ ఇచ్చిన కమెడియన్.. 

Soori-six-pack
2018-09-13 19:11:51

కమెడియన్స్ ఫిట్ గా ఉంటే వాళ్లు కామెడీ చేస్తున్నప్పుడు ఆ లుక్ తగ్గుతుంది. అందుకే ఇప్పటి వరకూ ఏ భాషలో చూసినా మన కమెడియన్స్ అందరూ దాదాపు బోండాంగానో లేక సన్నగానో ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో తమిళ్ లో స్టార్ కమెడియన్ గా ఎదిగిన పరోటా బాలు ఈ ట్రెండ్ కు బ్రేక్ వేయాలనుకున్నాడు. మొన్నటి వరకూ తమిళ్ లో చాలా సినిమాల విజయాల్లో కీలక నవ్వులు పోషించిన ఈ పరోటా బాలు ఇదుగో ఇలా సడెన్ గా సిక్స్ ప్యాక్ ఏకంగా కోలీవుడ్ కే షాక్ ఇచ్చాడు. అది కూడా నార్మల్ గా లేదు. చాలా హార్డ్ వర్క్ చేస్తే కానీ సాధ్యం కాని ఫిట్ నెస్  ఇది. ఇందుకోసం అతనెంత కష్టపడ్డాడో కానీ.. ఈ లుక్ చూశాక చాలామంది షాక్ అవుతున్నారనే చెప్పాలి. అన్నట్టు ఈ బాలుకు పరోటా బాలు అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా.. కొన్నాళ్ల క్రితం కబడ్డి కబడ్డి అనే సినిమా వచ్చింది. అది అంతకు ముందు తమిళ్ లో వచ్చిన సినిమాకు రీమేక్. అందులో పరోటాల పందెం పెట్టుకునే సీన్ ఉంటుంది. అప్పట్లో ఇతనికి ఏ గుర్తింపు లేదు. కానీ ఈ సీన్ తర్వాత పరోటా బాలుగా పేరు రావడమే కాదు.. ఆ పేరు ఇప్పుడు స్టార్ కమెడియన్ గా మార్మోగిపోతోంది. 

ఇక పరోటా బాలు మొదట్లో ఎక్కువగా విశాల్ సినిమాల్లోనే కనిపించేవాడు. అప్పట్లో సంతానం స్టార్ కమెడిన్ గా ఉండటంతో ఆ తర్వాత మూడు నాలుగు స్థానాల్లో ఉండిపోయాడు బాలు. కానీ సంతానం హీరో అయ్యాక.. ఇతర కమెడియన్స్ కు హిట్స్ రాకపోవడంతో బాలుకు కలిసొచ్చింది. వరుసగా అన్ని సినిమాల్లోనూ స్టార్ హీరోల సరసన ఫుల్ లెంగ్త్ రోల్స్ చేస్తూ స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. రీసెంట్ గా కార్తీ చినబాబులో అతని కామెడీకి తెలుగువాళ్లు కూడా పడిపడి నవ్వారు. అతన్ని చూడగానే నవ్వడానికి కారణం అతని ఫిజిక్కే. కానీ ఇప్పుడా ఫిజిక్ పూర్తిగా మారిపోయింది. మరి ఇతను కూడా హీరోగా ఏమైనా ట్రై చేస్తున్నాడేమో కానీ.. ఈ ప్యాక్ తో చాలామంది హీరోలను సైతం ఇన్స్ స్పైర్ చేశాడనే చెప్పాలి. 

More Related Stories