English   

పాపం.. దిల్ రాజుకు ఏంటి ఈ క‌ష్టాలు..?

No one Taking DIl Raju's Hello Guru PremaKosame Movie at Overseas
2018-09-14 07:03:26

ఎలాంటి వాళ్ల‌కైనా ఇండ‌స్ట్రీలో గోల్డెన్ పీరియ‌డ్ ఒక‌టి ఉంటుంది. ఆ టైమ్ లో యావ‌రేజ్ సినిమాలు చేసినా కూడా సూప‌ర్ హిట్ అయిపోతుంటాయి. 2017లో దిల్ రాజుకు అదే న‌డిచింది కూడా. ఆ ఏడాది ఆరు సినిమాలు వ‌స్తే అందులో డిజే, ఎంసిఏతో పాటు రాజా ది గ్రేట్ కూడా ఆ టైమ్ కు సుడి బాగుండి బండి లాక్కొచ్చేసాయి. దాంతో తానేం క‌థ ఓకే చేసినా సూప‌ర్ హిట్టే అని ఫిక్స్ అయిపోయాడు దిల్ రాజు. అయితే 2018లో ఆ మబ్బులు త్వ‌ర‌గానే విడిపోయాయి. ముందు ల‌వ‌ర్ తో.. ఆ త‌ర్వాత భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన శ్రీ‌నివాస క‌ళ్యాణంతో రెండు వ‌ర‌స షాకులు తిన్నాడు దిల్ రాజు. దాంతో ఇప్పుడు హ‌లో గురు ప్రేమ‌కోస‌మేతో ఎలాగైన హిట్ కొట్టాల‌ని చూస్తున్నాడు ఈ నిర్మాత‌. అయితే ఈ చిత్ర హీరో రామ్.. సినిమా యూనిట్ కు మ‌ధ్య ఏదో వార్ జ‌రుగుతుంద‌ని అంత‌ర్గ‌త వ‌ర్గాలు చ‌ర్చించుకున్నాయి.

అవ‌న్నీ సినిమాపై ఎక్క‌డ ప్ర‌భావం చూపిస్తాయో అని దిల్ రాజు ముందుగానే జాగ్ర‌త్త తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు ఓవ‌ర్సీస్ కోసం బ‌య్య‌ర్లు రావ‌డం లేదు. ఒక‌ప్పుడు దిల్ రాజు సినిమా అంటే ఎగ‌బ‌డి కొనేవాళ్లు కూడా ఇప్పుడు ల‌వ‌ర్.. శ్రీ‌నివాస క‌ళ్యాణం త‌ర్వాత దిల్ రాజు సినిమా అంటే ఎందుకో ఆలోచ‌న‌లో ప‌డుతున్నారు ఓవ‌ర్సీస్ బ‌య్య‌ర్లు. ఇప్పుడు హ‌లో గురు ప్రేమ‌కోస‌మేకు కూడా ఈ క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. రామ్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 18న విడుద‌ల కానుంది. అయినా ఇప్ప‌టి వ‌ర‌కు ఓవ‌ర్సీస్ రేట్ కూడా ఫిక్స్ కాలేదు. అక్క‌డ ఎవ‌రూ ఈ సినిమాను కొన‌లేదు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, ప్ర‌ణీత రామ్ తో జోడీ క‌ట్టారు. సెప్టెంబ‌ర్ 27న ఆడియో విడుద‌ల కానుంది ఈ చిత్రానిది. అటు రామ్.. ఇటు అనుప‌మ‌.. మ‌రోవైపు దిల్ రాజు.. ఈ సినిమా అంద‌రికీ కీల‌క‌మే. చూడాలి.. చివ‌రికి ఏం చేస్తుందో..?

More Related Stories