English   

స‌మంత సినిమాకు ఫ‌స్ట్ డే నే ఫ్లాప్ టాక్..

Samantha Akkineni Movie First Day Flop Talk By Audience
2018-09-14 07:27:15

అదేంటి.. యు ట‌ర్న్ సినిమాకు ఇక్క‌డ మంచి టాక్ వ‌చ్చింది క‌దా.. మ‌ళ్లీ ఫ్లాప్ టాక్ ఏంటి అనుకుంటున్నారా..? అప్ప‌ట్లో నాని, బాల‌య్య చేసిన రికార్డునే ఇప్పుడు స‌మంత కూడా చేసింది. ఒకేరోజు రెండు సినిమాల‌తో వ‌చ్చింది ఈ భామ‌. సెప్టెంబ‌ర్ 13న ఈమె కెరీర్ లో ప్ర‌త్యేకం. తెలుగు, త‌మిళ్ లో న‌టించిన యు ట‌ర్న్ తో పాటు అదే రోజు శివ‌కార్తికేయ‌న్ తో న‌టించిన సీమ‌రాజా కూడా విడుద‌లైంది. ఇందులో యు ట‌ర్న్ సినిమాకు టాక్ బాగానే వ‌చ్చింది. ఈ సినిమా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కింది. ప‌వ‌న్ కుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రం రెండు భాష‌ల్లోనూ పాజిటివ్ టాక్ తోనే వ‌చ్చింది. కానీ సీమ‌రాజా సినిమాకు మాత్రం కోరుకున్న టాక్ రాలేదు.

పొన్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ చిత్రానికి బిలో యావ‌రేజ్ టాక్ వ‌చ్చింది. వ‌ర‌స విజ‌యాలతో దూసుకుపోతున్న శివ‌కార్తికేయ‌న్ కు ఈ సినిమాతో బ్రేకులు ప‌డేలా క‌నిపిస్తున్నాయి. పొన్ర‌మ్ తో గ‌తంలో రెండు సినిమాలు చేసాడు శివ‌. వ‌ర‌త ప‌డ‌త వ‌ల‌బార్ సంఘం.. ర‌జినీ మురుగ‌న్ రెండూ హిట్టే. కానీ హ్యాట్రిక్ కొడదాం అనుకున్న సీమ‌రాజా మాత్రం అనుకున్న టాక్ తో ఓపెన్ కాలేదు. దాంతో రెండు సినిమాలు విడుద‌లైనా స‌మంత‌కు మాత్రం టెన్ష‌న్ త‌ప్ప‌ట్లేదు. ఓ సినిమా హిట్ అయింద‌ని సంతోషించేలోపు.. మ‌రో సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అక్క‌డ శివ‌కార్తికేయ‌న్ కు ఉన్న ఇమేజ్ తో సినిమా ఎలాగోలా ఓపెనింగ్స్ వ‌ర‌కు బ‌య‌ట‌ప‌డుతుంది కానీ లాంగ్ ర‌న్ మాత్రం క‌ష్ట‌మే. అయితే రెండు భాష‌ల్లోనూ యు ట‌ర్న్ సినిమాకు టాక్ బాగా రావ‌డం ఒక్క‌టే ఇప్పుడు స‌మంత‌కు క‌లిసొచ్చే అంశం.

More Related Stories