English   

డబ్బుల కోసం కోర్టుకెళ్లిన అర‌వింద్ స్వామి

Aravind Swamy Filled Case For Remuneration of Sathuranga Vettai 2
2018-09-14 10:31:29

చాక్లెట్ బాయ్.. అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు.. గ్రీకువీరుడు.. ఇలా ఎన్ని పేర్లుంటే అన్నీ అర‌వింద్ స్వామికి సెట్టైపోతాయి. 20 ఏళ్ల కింద అత‌డు అలా తెర‌పై న‌డిచొస్తుంటే ప‌డి చ‌చ్చిపోయే వాళ్లు అమ్మాయిలు. అంద‌గాడు అనే ప‌దానికి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉండేవాడు అర‌వింద్ స్వామి. కానీ ఎంత స్పీడ్ గా వ‌చ్చాడో అంతే స్పీడ్ గా ప‌డిపోయాడు అర‌వింద్ స్వామి. ఐదేళ్ల‌ కింద మ‌ణిర‌త్నం క‌డ‌ల్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు ఈ హీరో. అది ఫ్లాప్ అయినా అర‌వింద్ స్వామికి త‌నిఒరువ‌న్ సినిమాతో బ్రేక్ వ‌చ్చింది. ఈ సినిమాలో విల‌న్ గా ర‌ప్ఫాడించాడు ఈ హీరో. ఆ త‌ర్వాత ఎక్క‌డా వెన‌క్కి తిరిగి చూడ‌లేదు. తెలుగు రీమేక్ ధృవ‌లోనూ అర‌వింద్ స్వామినే విల‌న్ గా న‌టించాడు.

దీపం ఉండ‌గానే ఇళ్లు చ‌క్క‌బెట్టుకోవాలి అన్న‌ట్లు డిమాండ్ ఉన్న‌పుడే కోట్లు కురిపించుకుంటున్నాడు ఈ న‌టుడు. ఇప్పుడు స‌తురంగ వెట్టై 2 కోసం ఏకంగా కోటి 80 ల‌క్ష‌లు రెమ్యున‌రేష‌న్ తీసుకున్నాడు ఈ హీరో. అయితే ఈ సినిమా కోస‌మే ఇప్పుడు కోర్టు మెట్లెక్కాడు ఈయ‌న‌. త‌న‌కు ఇవ్వాల్సిన పారితోషికం ఎగ్గొట్టి సినిమాను విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్నాడ‌ని నిర్మాత మ‌నోబాల‌పై కేస్ పెట్టాడు అర‌వింద్ స్వామి. ఇప్పుడు ఈయ‌న నిర్మాత త‌న‌కు డ‌బ్బులిస్తే కానీ సినిమా విడుద‌ల కానివ్వం అంటున్నాడు ఈ హీరో. కోర్టు కూడా అర‌వింద్ స్వామికే స‌పోర్ట్ చేస్తుంది. ఆయ‌న డ‌బ్బులు ఇచ్చిన త‌ర్వాత కానీ సతురంగ వెట్టై 2ను విడుద‌ల చేయ‌రాద‌ని చెప్పింది. మొత్తానికి ఇప్పుడు అర‌వింద్ స్వామి కేస్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. సెప్టెంబ‌ర్ 20 లోపు ఏదో ఒక‌టి తేల్చాల‌ని మ‌నోబాల‌కు కోర్ట్ గ‌డువు ఇచ్చింది.

More Related Stories