English   

పాపం.. ఎన్టీఆర్ ఏం మాట్లాడ‌తాడో..?

Aravinda-Sametha
2018-09-14 10:54:30

జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎప్పుడు ఆడియో వేడుకల‌కు వ‌చ్చినా కూడా ఒక్క మాట చెబుతుంటాడు. ఇంటికి జాగ్ర‌త్త‌గా వెళ్లండి.. ఇంట్లో మీవాళ్ళు మీకోసం వేచి చూస్తుంటారు. వాళ్ల‌ను జాగ్ర‌త్త‌గా చూసుకోండి.. వెళ్లి మేం కూడా జాగ్ర‌త్త‌గా వ‌చ్చామ‌ని వాళ్ల ముందు నిల‌బ‌డండి.. అంటూ అభిమానుల‌కు ఓ పాఠం చెబుతుంటాడు నంద‌మూరి చిన్నోడు. త‌న అన్న‌య్య జాన‌కీరామ్ చ‌నిపోయిన త‌ర్వాత ప్ర‌తీసారి ఇది చెప్ప‌డం.. ప్ర‌తీ సినిమాకు ముందు ఓ ముందుమాట వేస్తుంటాడు ఎన్టీఆర్. అయితే జానకిరామ్ మ‌ర‌ణం త‌ర్వాత మ‌ళ్లీ త‌న ఇంటికే ఇలాంటి ఘోరం జ‌రుగుతుంద‌ని ఊహించ‌లేదు ఈ హీరో. కానీ అదే జ‌రిగింది. మ‌ళ్లీ యాక్సిడెంట్ లోనే హ‌రికృష్ణ మ‌ర‌ణం నంద‌మూరి కుటుంబాన్ని చిధిమేసింది. ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ అనాథ‌లు అయిపోయారు ఇప్పుడు. ఇలాంటి ప‌రిస్థితుల్లో అర‌వింద స‌మేత షూటింగ్ చేస్తున్నాడు. 

దాని ట్రైల‌ర్ డ‌బ్బింగ్ కూడా చెప్పేసాడు జూనియ‌ర్. ఇక ఈ చిత్ర ఆడియో వేడుక సెప్టెంబ‌ర్ 20న జ‌ర‌గ‌నుంది. అయితే ఇది నేరుగా మార్కెట్ లోకి పాట‌లు విడుద‌ల చేస్తారా.. లేదంటే ఆడియో వేడుక చేస్తారా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ప్రీ రిలీజ్ వేడుక ఒక‌టి ప్లాన్ చేస్తున్నార‌ని.. దానికి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వ‌స్తార‌ని తెలుస్తుంది. అయితే అక్క‌డ ఎన్టీఆర్ ఏం మాట్లాడ‌తాడు అనే దానిపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతుంది. తండ్రి చ‌నిపోయిన త‌ర్వాత అభిమానుల ముందుకొస్తున్న ఎన్టీఆర్.. అస‌లు ఏం మాట్లాడ‌తాడో.. ఎంత ఎమోష‌న‌ల్ అవుతాడో అని ఇప్ప‌ట్నుంచే ఆలోచిస్తున్నారు అభిమానులు. అన్ని జాగ్ర‌త్త‌లు చెప్పిన ఆ కుటుంబానికే దేవుడు అంత పెద్ద శిక్ష వేసాడు. దాంతో ఇప్పుడు కోరుకున్న వాళ్ల‌కు.. ఇష్ట‌మైన వాళ్ల‌కు ఇంకెన్ని జాగ్ర‌త్త‌లు చెప్ప‌బోతున్నాడో ఈ యంగ్ టైగ‌ర్ చూడాలిక‌. 

More Related Stories