English   

సుధీర్ బాబు రేంజ్ పెరిగిందండోయ్.. 

Nannu-Dochukunduvate
2018-09-14 12:09:48

సుధీర్ బాబు తొలి సినిమా చేసిన‌పుడు ఎవ‌రో కృష్ణ అల్లుడు అంట అన్నారు.. ఆ త‌ర్వాత ప్రేమ‌క‌థాచిత్రం హిట్ అయిన త‌ర్వాత కూడా మ‌హేశ్ బావ అంట అన్నారు. అందుకే ఇప్ప‌టికీ సుధీర్ బాబు త‌న సొంత గుర్తింపు కోసం పాకులాడుతూనే ఉన్నాడు. ఈయ‌న సినిమా సినిమాకు త‌న స్థాయిని పెంచుకుంటున్నాడు. సుధీర్ గ‌త రెండు సినిమాలు ప్రేక్ష‌కుల మెప్పు పొందుతూ వ‌స్తున్నాయి. శ‌మంత‌క‌మ‌ణితో పర్లేద‌నిపించిన ఈ హీరో.. మొన్న స‌మ్మోహ‌నం అంటూ వ‌చ్చాడు. ఈ సినిమా కూడా బాగానే ఆడింది. ఈ రెండు సినిమాల‌తో ఇండియాలోనే కాదు.. ఓవ‌ర్సీస్ లో కూడా ఈయ‌న‌కు మంచి క్రేజ్ వ‌చ్చింది. ఇప్పుడు ఇదే మార్కెట్ న‌న్ను దోచుకుందువటేపై క‌నిపిస్తుంది. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది. ఓవ‌ర్సీస్ రైట్స్ కోటి 10 ల‌క్ష‌ల‌కు కొన్నారు. 

ఇది సుధీర్ బాబు రేంజ్ కు చాలా ఎక్కువ‌. ఇప్పుడు అంతా వ‌చ్చిందంటే క‌చ్చితంగా సుధీర్ బాబు రేంజ్ పెరిగిన‌ట్లే. ఈ సినిమా సాఫ్ట్ వేర్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కింది. సుధీర్ బాబు హీరోగా ఆయ‌నే నిర్మాత‌గా మారి చేసిన సినిమా ఇది. ఆర్ఎస్ నాయుడు అనే కొత్త ద‌ర్శ‌కుడితో ఈ సినిమా చేసాడు సుధీర్. ట్రైల‌ర్ చూస్తుంటే సినిమా క‌చ్చితంగా ఆక‌ట్టుకునేలాగే క‌నిపిస్తుంది. పైగా నిర్మాత కూడా ఆయ‌నే కావ‌డంతో ప్ర‌మోష‌న్ కూడా బాగా గ‌ట్టిగా చేస్తున్నాడు. అన్నింటికి మించి సాఫ్ట్ వేర్ ప్రేమ‌క‌థ‌. కామెడీకి కూడా ఢోకా లేద‌ని ట్రైల‌ర్ తోనే క్లారిటీ ఇచ్చేసాడు ద‌ర్శ‌కుడు. ఇదే సినిమా అంతా ఉంటే క‌చ్చితంగా సుధీర్ తొలి ప్రొడ‌క్ష‌న్ పంట పండిన‌ట్లే. సెప్టెంబ‌ర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. ప్ర‌మోష‌నల్ వీడియో కూడా విడుద‌ల చేసి.. సినిమాపై హైప్ పెంచేసాడు ఈ హీరో. మ‌రి చూడాలిక‌.. ఓవ‌ర్సీస్ తో పాటు ఇక్క‌డ కూడా సుధీర్ చేయ‌బోయే మాయ ఎలా ఉండ‌బోతుందో..? 

More Related Stories