English   

దేవ‌దాస్ ఓవ‌ర్సీస్.. కొండంత భారం.. 

Deva-Das
2018-09-14 12:16:18

దేవ‌దాస్ అంటేనే క‌ష్టాల‌కు కేరాఫ్ అడ్ర‌స్. నాని, నాగార్జున సినిమాకు కూడా ముందు ఈ క‌ష్టాలే మిగిలాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న త‌ర్వాత కూడా బిజినెస్ కాక‌పోతే ఏం అనుకోవాలి మ‌రి..? అయ్య‌య్యో నాని సినిమాకు ఎన్ని క‌ష్టాలు వ‌చ్చాయ‌బ్బా.. అది కూడా ఒక్క ఫ్లాపుతోనే ఇక్క‌డ జాత‌కాలు మారిపోతాయా అనుకున్నారు అభిమానులు. కానీ ఇప్పుడు స‌త్తా చూపించాడు న్యాచుర‌ల్ స్టార్. కాస్త లేటైనా లేటెస్ట్ గా ర‌చ్చ చేస్తున్నారు నాని, నాగార్జున‌. నిజానికి ఈ సినిమాపై ముహూర్తం పెట్టిన‌పుడ నుంచి అంచ‌నాలు భారీగా ఉన్నాయి.  మొన్న‌టి వ‌ర‌కు ఈ చిత్ర ఓవ‌ర్సీస్ రైట్స్ అమ్ముడుకాలేదంటే న‌మ్మ‌డానికి ఆశ్చ‌ర్యమే. 

నాని, నాగార్జున లాంటి స్టార్స్ ఉన్నా కూడా ఎందుకో ఇప్ప‌టి వ‌ర‌కు దేవ‌దాస్ రైట్స్ తీసుకోలేదు. బ‌హుశా నానికి కృష్ణార్జున యుద్ధం.. నాగార్జున‌కు ఆఫీస‌ర్ ఫ్లాపుల ప్ర‌భావం క‌లిపి దేవ‌దాస్ పై ప‌డిందేమో మ‌రి. కార‌ణం ఏదైనా కానీ ఇంత భారీ సినిమా రైట్స్ చాలా రోజుల వ‌ర‌కు అమ్ముడు కాలేదు. అయితే ఇప్పుడు ఏకంగా 4 కోట్ల‌కు ఈ సినిమాను కొన్నారు. ఇంత మొత్తం పెట్టి సినిమా తీసుకున్నారంటే నాని, నాగార్జున‌పై కొండంత భారం పెట్టిన‌ట్లే. 4 కోట్లు రావాలంటే క‌నీసం 1.4 మిలియ‌న్ రావాలి. టాక్ బాగా వ‌చ్చిందంటే ఓకే.. లేదంటే మాత్రం క‌ష్టాలు త‌ప్ప‌వు. సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానుంది ఈ చిత్రం. మొత్తానికి చూడాలిక‌.. దేవ‌దాస్ ర‌చ్చ ఎలా ఉండ‌బోతుందో..? 

More Related Stories