English   

విజ‌య్ టిఆర్ఎస్ కి ప్ర‌చారం చేస్తాడా..? 

Vijay-Devarakonda
2018-09-14 13:02:29

విజ‌య్ అంటే త‌మిళ హీరో విజ‌య్ కాదు.. మ‌న హీరోనే. లేటెస్ట్ సెన్సేష‌న్ ఆఫ్ టాలీవుడ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈయ‌న రాజ‌కీయాల్లోకి వ‌స్తాడా అనే ఆలోచ‌న‌లు ఇప్పుడు వ‌స్తున్నాయి. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఈయ‌న టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు బంధువు. మంత్రి కేటీఆర్ విజ‌య్ కి బావ అవుతాడ‌నే టాక్ ఉంది. వాళ్ల అండ‌తోనే విజ‌య్ ఎదుగుతున్నాడ‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌తీ సినిమాకు కేటీఆర్ కూడా త‌న‌వంతుగా ఫ్రీ ప్ర‌మోష‌న్ చేస్తుంటాడు. మొన్న గీత‌గోవిందం కూడా అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేసాడు. ఇంటికి వెళ్లొచ్చాడు కూడా. అయితే ఇప్పుడు మ‌రో ఆలోచ‌న కూడా వినిపిస్తుంది. 

టిఆర్ఎస్ పార్టీకి విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌చారం చేస్తాడా అనే ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ ఇండ‌స్ట్రీలో జ‌రుగుతుందిప్పుడు. ప్ర‌చారం అంటే మైకులు ప‌ట్టుకుని జూనియ‌ర్ ఎన్టీఆర్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ లా ఊరూరు తిర‌గ‌డం కాదు. సింపుల్ గా సోష‌ల్ మీడియా క్యాంపైనింగ్ అన్న‌మాట‌. ఇప్పుడు ఇదే వార్త‌లు అన్నిచోట్లా వినిపిస్తున్నాయి. ట్విట్ట‌ర్ లో కానీ.. ఇతర సోష‌ల్ మీడియా స్టేజ్ ల‌పై కానీ విజ‌య్ టిఆర్ఎస్ కు స‌పోర్ట్ చేస్తాడ‌నే వార్త‌లు బ‌లంగా వ‌స్తున్నాయి. ఈయ‌న‌కు ఉన్న క్రేజ్ వాడుకోడానికి కేటీఆర్ కూడా ప్లాన్ చేస్తున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి ఇందులో నిజం ఎంతుందో తెలియ‌దు కానీ కేటీఆర్, విజ‌య్ మ‌ధ్య ఉన్న సాన్నిహిత్యం చూస్తుంటే మాత్రం ఇది నిజ‌మే అనిపించ‌క మాన‌దు. మ‌రి చూడాలిక‌.. రాబోయే ఎన్నిక‌ల్లో విజ‌య్ హ‌స్తం ఎలా ఉండ‌బోతుందో..? 

More Related Stories