English   

బండ్ల గణేష్.. ఇంతింతై.. రాజకీయ నాయకుడై.. 

Bandla-Ganesh
2018-09-14 14:10:43

ఎదగాలనుకునేవాళ్లకు టాలెంట్ ఉంటే సరిపోదు. ఓర్పు ఉండాలి. దానికి కాస్త ‘నేర్పు’ ప్రదర్శించగలిగితే కాస్త లేట్ అయినా అనుకున్నది సాధిస్తారు. ఇందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బండ్ల గణేశ్. ఒకప్పుడు చాలా చిన్న చిన్న పాత్రలతో వెండితెరపై కనిపించిన బండ్ల గణేశ్ కొన్నాళ్ల క్రితం ఓ రాజకీయ పార్టీ హయాంలో అనూహ్యంగా ఎదిగాడు. అందుకు చాలామంది రకరకాల కారణాలు చెప్పుకున్నా.. తను మాత్రం కేవలం ‘ఫౌల్ట్రీ’ వల్లే ఎదిగానని మైకులు గుద్ది మరీ చెబుతాడు. ఈ క్రమంలోనే ఏకంగా పవన్ కళ్యాణ్ తోనే సినిమా నిర్మించే స్థాయికి ఎదిగాడు. కానీ నిర్మాణం మనోడికి పెద్దగా కలిసి రాలేదు. దీనికి తోడు కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తాడనే పేరూ ఉంది. దీంతో టెంపర్ టైమ్ లో ఎన్టీఆర్ తో గొడవ పడ్డాడు అనే రూమర్స్ కూడా వినిపించాయి. ఏదేమైనా మొత్తంగా బండ్ల గణేష్ సమాజంలో తనకంటూ ఓ బిజినెస్ మేన్, క్రోర్ పతీ హోదా తెచ్చుకున్నాడు. దాన్ని మరింత విస్తరించుకుంటూ ఇప్పుడు ఏకంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు.
 
లేటెస్ట్ గా బండ్ల గణేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆద్వర్యంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని.. నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త అనే మాటల సరసన ‘రాజకీయ నాయకుడు’ అనే ట్యాగ్ తగిలించుకోబోతున్నాడు. అయితే ఇలా కండువా మాత్రమే కప్పుకుంటే అతను గణేశ్ ఎందుకవుతాడు.. యస్.. మనోడు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నాడు. ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉన్నాడు. ఆయనతో పోటీకి దిగేందుకు కాంగ్రెస్ నుంచి ఈ సీట్ ఆశిస్తున్నాడు. మరి బండ్ల గణేశ్ కోరికను అధిస్టానం మన్నిస్తుందో లేదో చూడాలి. 

More Related Stories