English   

నితిన్ ను ఈ హీరోయిన్ ఆదుకుంటుందా..?

Rashmika-Mandanna
2018-09-14 15:29:45

తెలుగు సినిమా పరిశ్రమలో నితిన్ అంత లక్కీ ఫెలో మరొకరుండరు. నిజం.. అరంగేట్రం అదిరిపోయింది. వరుసగా (జయం, దిల్, సై) హిట్స్ కొట్టాడు. ఓవర్ నైట్ యాత్ స్టార్ గా మారాడు. ఆ టైమ్ లో ఉదయ్ కిరణ్, తరుణ్ వంటి వారితో పోటీ ఉన్నా తట్టుకున్నాడు. కానీ మధ్యలో మనోడికి ‘‘మాస్’’ దోమ కుట్టింది. దీంతో అన్నీ యాక్షన్ సినిమాలే చేశాడు. కానీ వాటి రియాక్షన్ ఫ్లాపులు గా వచ్చింది. దీంతో వరుసగా డజను ఫ్లాపులు చూశారు. పెద్దగా స్టార్డమ్ లేని ఓ హీరోకు ఇన్ని ఫ్లాపులు వస్తే ఇక అతని కెరీర్ ఆగిపోతుంది. బట్ బ్యాక్ గ్రౌండ్ స్ట్రాంగ్ గా ఉండటంతో నితిన్ నిలబడ్డాడు. 

కొంత గ్యాప్ తీసుకుని ఇష్క్ తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. అంతే కాదు.. తను ఎలాంటి సినిమాలు చేస్తే ఆడియన్స్ ‘‘ఇష్క్ పడతారో’’ కూడా తెలుసుకున్నాడు. అప్పటి నుంచి మళ్లీ మెస్మరైజ్ చేయడం స్టార్ట్ చేశాడు. గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్ ఎటాక్ మూవీస్ తో మరో హ్యాట్రిక్ వచ్చింది. దీంతో మనోడ్ని తెలంగాణ పవర్ స్టార్ అని కూడా అనేశారు. ఇక నితిన్ కెరీర్ గాడిలో పడ్డట్టే అనుకుంటోన్న టైమ్ లో మళ్లీ రూట్ మారింది. చాలా అంచనాలు పెట్టుకున్న సినిమాలు కూడా దారుణంగా నిరాశపరచడం మొదలైంది.

రీసెంట్ గా వచ్చిన దిల్ రాజు నిర్మించిన శ్రీనివాస కళ్యాణం ఫ్లాప్ లో నితిన్ కు ఒక రకంగా మైండ్ బ్లాంక్ అయిందనే చెప్పాలి. దీంతో ఇప్పుడు చేస్తోన్న సినిమాపై మరోసారి యధావిధిగానే చాలా ఆశలు పెట్టుకున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ మూవీకి ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకుడు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో ‘హిట్ మెషీన్’గా మారిన రష్మిక మందన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ భామ నటించిన ప్రతి సినిమా హిట్టే అన్న టాక్ తెచ్చుకుంది. పైగా రెండు సినిమాలకే స్టార్ హీరోయిన్ హోదాకు దగ్గరగా వచ్చింది. 

లేటెస్ట్ గా గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండకు ధీటుగా అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. దీంతో ఈ భామపై నితిన్ ఆశలు పెట్టుకున్నాడు. రష్మిక లక్కీ లెగ్ తనకూ హిట్ తెస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీకి ‘‘భీష్మ’’ అనే టైటిల్ కన్ఫార్మ్ చేశారు. మరి ఈ లక్కీ లేడీ నితిన్ కు కూడా హిట్ ఇస్తుందేమో చూడాలి. 

More Related Stories