English   

అలీకి కష్టాలు తెచ్చిన టివి షో.. ?

Deshamlo-Dongalu-Paddaru
2018-09-14 17:33:08

కమెడియన్ గా పీక్స్ చూసిన నటుడు అలీ. హీరోగానూ యాభై సినిమాలు చేసిన ఫస్ట్ ఇండియన్ కమెడియన్ గానూ అతనికో రికార్డ్ ఉంది. అఫ్ కోర్స్ వీటిలో సక్సెస్ రేషియో ఎంత అనేది పక్కన బెట్టినా.. రికార్డ్ రికార్డే కదా. అయితే అలీ గత కొన్నాళ్లుగా సినిమాలు తగ్గించుకున్నాడు(..?). అంటే కొందరు ఆఫర్స్ తగ్గాయని కూడా చెబుతున్నారు. కానీ అలీ తలచుకుంటే ఆఫర్స్ కొదవేం లేదు. అయినా అతను టివి షోస్ తో బిజీగానే ఉంటున్నాడు. పైగా అలీ షోస్ కు బుల్లితెరపై మంచి రేటింగ్ కూడా ఉంటుంది.అ యితే ఇప్పుడా టివి షోనే అలీ కష్టాలు తెచ్చింది. అవును మీరు చదివింది నిజమే.. ఈ షోనే ఇప్పుడు అలీకి కొత్త కష్టాలు తెచ్చింది. ఇందుకోసం అందరి కాళ్లూ పట్టుకుంటున్నాడీ కాట్రే.

సరిగ్గా యేడాది క్రితం అలీ తన షోకు తమ్ముడు ఖయ్యూమ్ ను ఇన్వైట్ చేశాడు. అతనితో పాటు మరో కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి కూడా వచ్చాడా షోకు. ఆ షోలో.. అలీ ఒక ప్రశ్న అడిగాడు. ‘అలీ తమ్ముడుగా నీకు మంచి జరిగిందా’.. అని. దానికి ఖయ్యూమ్ ‘అలీ తమ్ముడుగా నాకు మేలుకంటే నష్టమే ఎక్కువ జరిగింది’ అని షాకింగ్ కమెంట్స్ చేశాడు. నిజానికి ఆ టైమ్ లో ఈ మాటలు విన్న అలీ కూడా షాక్ అయ్యాడు. కట్ చేస్తే ఇప్పుడు తమ్ముడు కోసం నిర్మాతగా మారాల్సి వచ్చింది అలీకి. ఇది అతను ఊహించనిది. నిర్మాతలుగా వేరే పేర్లు వేస్తున్నా.. దీనికి బ్యాక్ బోన్ అంతా అలీయే అంటోంది టాలీవుడ్. 

దేశంలో దొంగలుపడ్డారు.. అనే టైటిల్ తో ఓ కొత్త సినిమా వస్తోంది. ఇందులో ఖయ్యూమ్ హీరో. అలీ సమర్పకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఇన్నేళ్లలో అలీ సమర్పిస్తోన్న సినిమా ఇదే అంటే అర్థం చేసుకోవచ్చు.. అతను తమ్ముడి మాటలకు ఎంత హర్ట్ అయ్యాడో. మొత్తంగా ఈ మూవీ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రేపు(15.09.18)సాయంత్రం 6గంటలకు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ మూవీ ట్రైలర్ కూడా విడుదల చేయబోతున్నారు. చిరంజీవి ఒప్పుకున్నాడంటే కారణం కూడా అలీయే అని వేరే చెప్పక్కర్లేదు. మొత్తంగా తన షోకు వచ్చిన తమ్ముడి మాటలకు అలీ ఇలా ఏకంగా నిర్మాతగా మారాల్సి వచ్చిందన్నమాట. మరి ఈ దేశంలో దొంగలుపడ్డారు.. సినిమా మంచి ఫలితాన్నివ్వాలని.. అలీ తమ్ముడి కోసం పడుతున్న శ్రమ సక్సెస్ కావాలని కోరుకుందాం.. 

More Related Stories