English   

వైఎస్ జగన్ పాత్రలో విజయ్ దేవరకొండ

Vijay-Devarakonda-jagan
2018-09-14 17:55:42

బయోపిక్స్ పెరుగుతున్నా కొద్దీ వాటిపై క్రేజ్ పెంచే బాధ్యత ఆ మేకర్స్ కు పెరుగుతుంది. అందుకే వీలైనంత ఎక్కువ అటెన్షన్ డ్రా చేయడానికి ట్రై చేస్తుంటారు. ఈ నేపథ్యంలో నందమూరి తారకరామారావు బయోపిక్ కోసం క్రిష్ చాలా అటెన్షన్ తెస్తున్నాడు. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’కు సంబంధించి అంత సీన్ కనిపించడం లేదు. మమ్మూట్టి తప్ప మరో క్రేజీ ఆర్టిస్ట్ ఈ సినిమాలో ఉన్నట్టు ఇంత వరకూ ఏ న్యూసూ బయటకు రావడంలేదు. కొన్ని వార్తలు వచ్చినా అవన్నీ రూమర్స్ గా ఉన్నాయి. లేదంటే వాళ్లున్నారనో లేరనో మూవీ టీమ్ నుంచి ఏ క్లారిఫికేషన్ లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడీ హాట్ న్యూస్ తెలుగు సినిమా పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. 

యాత్ర సినిమాలో వైఎస్ఆర్ తర్వాత అంత క్రేజ్ ఉన్న క్యారెక్టర్ జగన్ దే కదా. ముందుగా ఈ పాత్రను తమిళ నటుడు కార్తీ చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. తర్వాత సూర్య కూడా చేస్తాడు అన్నారు. కానీ వాళ్లెవరూ ఈ విషయాన్ని కన్ఫార్మ్ చేయలేదు. ఇటు మూవీ టీమ్ ఏం చెప్పలేదు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పాత్రలో విజయ్ దేవరకొండను తీసుకోబోతున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే అతను చేస్తాడా లేదా అనేది తెలియదు కానీ.. ఈ మూవీ టీమ్ నుంచి విజయ్ ని అప్రోచ్ అయింది మాత్రం నిజం అంటున్నారు. ఎన్టీఆర్ మూవీకి వస్తోన్న క్రేజ్ ను బట్టి వీళ్లు కూడా తమ సినిమాపై అంచనాలు పెంచాలనుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ అయితే ఒక్కసారిగా క్రేజ్ వస్తుందనే ఆలోచనతో ఉన్నారట. అందుకే రీసెంట్ గా ఈ మూవీ టీమ్ విజయ్ ని కలిసి అతని పాత్రను వివరించినట్టు టాక్. 

నిజానికి ఈ మూవీలో జగన్ పాత్రకు ఎక్కువ స్కోప్ ఉండదట. తండ్రి పాదయాత్రం మొదలుపెట్టినప్పుడు కొంచెం.. తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక మరికొంచెం సేపు.. ఆయన చనిపోయిన తర్వాత ఇక బాధ్యత తనదే అన్నట్టుగా కొన్ని షాట్స్ ఉంటాయని చెబుతున్నారు. మహా అయితే ఓ నాలుగైదు రోజుల షూటింగ్ ఉంటుందట. మరి ఈ మేటర్ లో విజయ్ దేవరకొండ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. 

More Related Stories