English   

ఎవర్ గ్రీన్ యముడు మళ్లీ వస్తున్నాడు

Kaikala-Satyanarayana
2018-09-14 18:09:43

ఎవర్ గ్రీన్ యముడు.. ఈ మాట తెలుగు నటుల్లో ఎవరికి సరిగ్గా సరిపోతుంది.. వేరే ఆలోచన లేకుండా నవరస నటసార్వభౌమ కైకాల సత్యనారాయణకే దక్కుతుంది. అంతకు ముందు ఎస్వీ రంగారావు ఆ పాత్రలో జీవించినా.. తర్వాత ఆయన స్థాయికి ఏ మాత్రం తగ్గని ప్రతిభతో ఆకట్టుకున్నది మాత్రం ఒకే ఒక్కడు. ఆయనే కైకాల సత్యనారాయణ. యమగోల నుంచి మొదలైన ఆయన ‘యమ అల్లరి’.. ఆ తర్వాత ఎన్నో సినిమాల విజయాల్లో కీలక పాత్రలు పోషించింది. అయితే గత కొంతకాలంగా వయోభారంతో సినిమాలకు దూరమైన ఆయన మళ్లీ ఈ మధ్యే ‘‘ఎన్టీఆర్’’ సినిమాతో మొహానికి రంగేసుకున్నారు. ‘‘ఎన్టీఆర్’’ మూవీలో ఆయన టాకీ పులి హెచ్ఎమ్ రెడ్డి పాత్రలో నటిస్తున్నారు. ఒక రకంగా ఆయన గొంతు పాడైంది. అయినా ఈ సారి మళ్లీ యముడు పాత్రలో నటించేందుకు సిద్ధపడటం విశేషం.

 యస్.. కైకాల సత్యనారాయణ మళ్లీ యముడుగా మన ముందుకు రాబోతున్నారు. ‘‘దీర్ఘ ఆయుష్మాన్ భవ’’ అనే సినిమాలో సత్యనారాయణ మరోసారి యముడిగా కనిపించబోతున్నారు. నిజానికి యముడు పాత్ర పలికే డైలాగులు చాలా గంభీరంగా ఉంటాయి. ఆ గంభీరతను తెచ్చింది ఎస్వీఆర్ అయితే కంటిన్యూ చేసింది కైకాల. కానీ ఇప్పుడు ఆయన గొంతు సరిగా లేదు. మరి ఎలా మేనేజ్ చేస్తారో కానీ.. మొత్తంగా సత్యనారాయణ మళ్లీ వస్తుండటం ఆ కాలం ప్రేక్షకులకే కాదు.. నేటి కొత్త తరానికీ ఓ ఉత్సాహాన్నిస్తుందని చెప్పాలి. ఏదేమైనా టైటిల్ కు తగ్గట్టుగా ఈ నవరస నటసార్వభౌముడు టైటిల్ లాగే జీవించాలని కోరకుందాం. 

More Related Stories