English   

సుధీర్ బాబు ఈ సారి ఫిక్స్ అయ్యాడు

Nannu-Dochukunduvate
2018-09-14 18:44:08

సుధీర్ బాబు డబుల్ యాక్షన్ చేసిన సినిమా ‘నన్ను దోచుకుందువటే’. అయితే ఇందులో డ్యూయొల్ రోల్ రెండురకాలుగా కనిపిస్తుంది. ఒకటి తెర ముందు.. మరొకటి తెర వెనక. యస్.. సుధీర్ బాబు సొంత ప్రొడక్షన్ హౌస్ లో రూపొందిన ఫస్ట్ మూవీ ఇది. అంటే హీరోగా ఓ పాత్ర, నిర్మాతగా మరో పాత్ర చేస్తూ రూపొందించిన సినిమా ఇదన్నమాట. నభా నటేష్ హీరోయిన్ గా ఇంటర్ డ్యూస్ అవుతోంది. ఈ మూవీతో ఆర్ఎస్ నాయుడు దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. నిజానికి ఈ సినిమా ఈ వినాయక చవితి సందర్భంగానే విడుదల కావాల్సి ఉంది. కానీ పోటీ పెద్దగా ఉండటంతో సుధీర్ వెనక్కి తగ్గాడు. మొత్తంగా ఓ వారం ఆలస్యంగా ఈ నెల 21న రాబోతున్నట్టు అనౌన్స్ చేశాడు. 

నన్నుదోచుకుందువటే.. ఈ టైటిల్ ఆకట్టుకునేలా ఉంది. అందుకు తగ్గట్టే కంటెంట్ కూడా ఉంటుందని ట్రైలర్ ను బట్టి అర్థమైంది. సుధీర్ బాబు యారోగెంట్ బాస్ గా కనిపిస్తున్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ట్రైలర్ కంటే ముందే వచ్చిన టీజర్ తోనే ఆకట్టుకున్న సుధీర్.. ట్రైలర్ తో మరింత ఇంప్రెస్ చేశాడు. ఈ ట్రైలర్ కు చాలామంది సెలబ్రిటీస్ సైతం ఫిదా అయ్యి ఆల్ ది బెస్ట్ చెప్పారు.   అందుకే చాలా కాన్ఫిడెంట్ గా ప్రమోషన్స్ చేస్తున్నాడు.తనే నిర్మించాడని కాదుగానీ.. కంటెంట్ పరంగా ఈ సినిమాపై సుధీర్ బాబు చాలానమ్మకంగా ఉన్నాడు. ఇక ఈ నెల 21న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాడు. మరి అతని నమ్మకం ఏ మేరకు నిజమవుతుందో చూడాలి. అలాగే ఈ సినిమా క్లిక్ అయితే నిర్మాతగా ఫ్యూచర్ లో మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ కు రంగం సిద్ధం చేసుకుంటాడతను. 

More Related Stories