English   

శైలజారెడ్డి అల్లుడుకి అంత సీన్ ఉందా..?

Sailaja-Reddy-Alludu
2018-09-14 18:59:45

అక్కినేని నాగచైతన్య, మారుతి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ శైలజా రెడ్డి అల్లుడు. ఈ గురువారం విడుదలైన ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి. చాలా వరకూ రొటీన్ సినిమాగానే తేల్చేశారు. కానీ రమ్యకృష్ణ ఉండటం..అనూ ఇమానుయేల్ గ్లామర్ తో పాటు,  ముందు నుంచీ ప్రణాళికా బద్ధంగా చేసిన ప్రమోషన్స్ కలిసొచ్చాయి. అందుకే మంచి ఓపెనింగ్స్ వచ్చాయీ సినిమాకు. ఈ కారణంగానే తొలి రోజు ఏకంగా ఏడు కోట్ల వరకూ షేర్ వసూలు చేసిన చైతూ కెరీర్ లో ఆల్ టైమ్ బెస్ట్ గా నిలిచింది. ఫస్ట్ రోజు కాబట్టి అలా వచ్చిందనుకోవచ్చు. కానీ తర్వాతి నుంచి పరిస్థితి ఏంటి..? సినిమాకు వచ్చిన రివ్యూస్ అండ్ మౌత్ టాక్ ను బట్టి చూస్తే ముందు ముందు అలా సత్తా చాటడం దాదాపు అసాధ్యం. మరి అలాగైతే సినిమా గట్టెక్కుతుందా..? అసలే చైతూ కెరీర్ లో హయ్యొస్ట్ ప్రైస్ కు అమ్మేసిన సినిమా ఇది. 

సితార బ్యానర్ లో రూపొందిన శైలజా రెడ్డి అల్లుడు.. సినిమాపై అంచానాలైతే పెంచారు. కానీ వాటిని అందుకునేంత స్టఫ్ సినిమాలో లేదనేది నిజం. కానీ సినిమా థియేట్రికల్ రైట్స్ ను మాత్రం ఏకంగా 25కోట్లకు అమ్మేశారు. అంటే శైలజా రెడ్డి అల్లుడు మొత్తంగా 40కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తే కానీ ఈ మొత్తం రికవర్ కాదు. ఫస్ట్ డే క్రేజ్ తో 13కోట్ల వరకూ గ్రాస్ వసూలు చేయగలిగిందీ సినిమా. కానీ నలభై కోట్లంటే అంత వర్కవుట్ అవుతుందా అంటే ఖచ్చితంగా సాధ్యం కాదని చెప్పొచ్చు. 

ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ టైమ్ లో మళ్లీ పాత చింతకాయ పచ్చడి తెచ్చారు. పోనీ అదేమైనా టేస్ట్ ఉందా అంటే అదీ లేదు. అంటే ఓ రొటీన్ సినిమాకు పెద్దగా ట్విస్ట్ లు, కాన్ ఫ్లిక్ట్ లేని కథనంలో ఆడియన్స్ పై రుద్దాలనుకున్న మారుతి ప్లాన్ బెడిసికొట్టినట్టే చెప్పొచ్చు. మొత్తంగా శైలజారెడ్డి అల్లుడుతో సితార బ్యానర్ కు ఫ్లాప్ పడ్డట్టే అనుకోవాలా..?

More Related Stories