English   

దేవుడికే హ్యాండిచ్చిన భ‌క్తుడు

Pawan Kalyan's Devotee Bandla Ganesh Joined into Congress Party
2018-09-15 08:58:39

అదేంటి అంద‌రికీ దేవుడు క‌దా హ్యాండిస్తుంటాడు. ఆయ‌న కోరుకున్న‌దే క‌దా ఎప్పుడూ జ‌రుగుతుంది. అలాంటిది ఆ దేవుడికే హ్యాండిచ్చేంత గొప్ప వాళ్లు కూడా మ‌న ద‌గ్గ‌ర ఉన్నారా అనుకుంటున్నారా..? ఉన్నారు.. ఖచ్చితంగా ఉన్నారు.. కావాలంటే బండ్ల గ‌ణేష్ ను చూడండి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సిఎం అవుతాడు.. ఆయ‌న సిఎం కాక‌పోతే నేను గుండు కొట్టించుకుంటా.. నా గుండె కోస్తే అందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ప్ప ఇంకెవ‌రూ క‌నిపించరు.. నా దేవుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటూ ఇలా చాలా గొప్ప‌లు చెప్పాడు బండ్ల‌. కానీ తీరా ఇప్పుడు చూస్తుంటే ప‌వ‌న్ పొద్దున లేచి తిట్టే పార్టీ కాంగ్రెస్.. అదే పార్టీలో వెళ్లి జాయిన్ అయ్యాడు. కాంగ్రెస్ కండువా క‌ప్పుకుని ప‌వ‌న్ కే హ‌స్తం చూపించాడు. తెలంగాణ నుంచి జ‌న‌సేన నాయ‌కుడిగా ప‌వ‌న్ చెంత‌నే ఉంటాడ‌ని అంతా బండ్ల గ‌ణేష్ ను అనుకున్నారు.

ప‌వ‌ర్ స్టార్ తో ఉన్న సాన్నిహిత్యం కార‌ణంగా ఈయ‌న ఇక్క‌డే ఉంటాడేమో అనుకున్నారు. కానీ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా వెళ్లి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. బండ్ల గ‌ణేష్ ఇంత స‌డ‌న్ గా హ‌స్తం చెంత‌కు చేర‌డానికి వెన‌క పెద్ద త‌ల‌కాయ‌లు చాలానే ఉన్నాయ‌ని తెలుస్తుంది. ముఖ్యంగా ఓ బ‌డా మీడియా ఛానెల్ అధినేత‌తో పాటు ఇద్ద‌రు ప్రింట్ మీడియా అధినేత‌లు కూడా ఉన్నార‌ని టాక్. వాళ్లంతా క‌లిసే రాత్రికి రాత్రి బండ్ల గ‌ణేష్ ను ఢిల్లీ పంపించి రాహుల్ గాంధీతో క‌లిపించి మ‌రీ కాంగ్రెస్ తీర్థం తీసుకొమ్మ‌ని చెప్పారు.. అలాగే ఈయ‌న కూడా తీసుకున్నాడు. ఈ  మొత్తం ప్రాసెస్ లో ప‌వ‌న్ కే హ్యాండిచ్చాడు బండ్ల గ‌ణేష్. భ‌క్తుడు కాస్తా దేవుడును కాద‌ని ప‌క్క‌కెళ్లిపోయాడు. సారీ సారీ.. ప‌క్క పార్టీలోకి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఈయ‌న షాద్ న‌గ‌ర్ నుంచి కానీ.. జూబ్లీహిల్స్ నుంచి కానీ పోటీ చేసే అవ‌కాశం ఉంది.

More Related Stories