English   

కొర‌టాల విష‌యంలో వెన‌క్కి త‌గ్గిన చిరు.. 

Chiranjeevi-Koratala-Siva
2018-09-15 10:29:52

స‌్టార్ డైరెక్ట‌ర్ తో సినిమా అన్న‌పుడు స్టార్ హీరోల‌కు కూడా అప్పుడ‌ప్పుడూ కొన్ని తిప్ప‌లు త‌ప్ప‌వు. అప్పుడ‌ప్పుడు ద‌ర్శ‌కుల‌కు కూడా ఈ తిప్ప‌లు ఉంటాయి. వాటిని అధిగ‌మిస్తే కానీ ముందుకు వెళ్ల‌లేరు. ఇప్పుడు చిరంజీవి, కొర‌టాల‌కు ఇదే తిప్ప‌లు వ‌చ్చేలా క‌నిపిస్తుంది. గ‌తేడాది మ‌హేశ్ బాబు లాంటి సూప‌ర్ స్టార్ కూడా ఓ వైపు స్పైడ‌ర్ చేస్తూనే మ‌రోవైపు కొర‌టాల‌తో భ‌ర‌త్ అనే నేను షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇప్పుడు చిరంజీవికి కూడా ఇదే క‌ష్టాలు క‌ళ్ల‌ముందు క‌నిపిస్తున్నాయి. ఈయ‌న ప్ర‌స్తుతం సైరా సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ జార్జియాలో జ‌రుగుతుంది. దీనికోసం 50 మంది టీం వెళ్లారు. ఈ భారీ షెడ్యూల్ లో యాక్ష‌న్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ కుడు సురేంద‌ర్ రెడ్డి. ఇందులో చిరంజీవితో పాటు విజ‌య్ సేతుప‌తి, అమితాబ్, సుదీప్, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా లాంటి స్టార్ క్యాస్ట్ అంతా ఉన్నారు. ఇప్ప‌టికే షూటింగ్ స‌గం పూర్తి అయిపోయింద‌ని చెప్పాడు నిర్మాత రామ్ చ‌ర‌ణ్. డిసెంబ‌ర్ నాటికి మొత్తం పూర్తి చేయాల‌ని చూస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఈ చిత్రం సెట్స్ పై ఉండ‌గానే కొర‌టాల శివ‌తోనూ సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నాడు మెగాస్టార్. ఈయ‌న చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో వెంట‌నే పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించాడు మెగాస్టార్. ఇప్పుడు కొర టాల ఇదే ప‌నిమీద బిజీగా ఉన్నాడు. అయితే ఈ చిత్రం ముందు ఇదే ఏడాది ప‌ట్టాలెక్కించాల‌ని చూసాడు. కానీ ఇప్పుడు అలా చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని భావిస్తున్నాడు చిరంజీవి. అందుకే ఈ సినిమా విష‌యంలో కాస్త వెన‌క్కి త‌గ్గాడు. ముందు సైరా అయిపోయిన త‌ర్వాత కానీ కొర‌టాల ద‌గ్గ‌రికి వెళ్ల‌కూడ‌ద‌ని పిక్స‌య్యాడు. అందుకే వ‌చ్చే ఏడాది మార్చ్ వ‌ర‌కు కొర‌టాల సినిమాను వాయిదా వేసాడు. పైగా కొర‌టాల శివ కూడా ఇప్పుడు క‌థ పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. సైరా సినిమాను వీలైనంత త్వ‌ర‌గా పూర్తిచేసి కొర‌టాల కోసం వ‌చ్చేయాల‌ని చూస్తున్నాడు చిరంజీవి. ఈ సినిమా ఠాగూర్ త‌ర‌హాలో సోష‌ల్ మెసేజ్ ఉన్న క‌థ‌తో రాబోతుంది. మైత్రి మూవీ మేక‌ర్స్ తో క‌లిసి కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.  

More Related Stories