English   

డైరెక్టర్ శంకర్ కే టార్చర్ చూపిస్తున్న కమెడియన్

Director Shankar Given a Complaint on Comedian Vadivelu
2018-09-15 10:46:42

హింసించే 23వ రాజు పులికేశి. ఇప్పుడు ఇది రియ‌ల్ లైఫ్ లో కూడా సార్థ‌కం చేసుకుంటున్నాడు క‌మెడియ‌న్ వ‌డివేలు. ఈ క‌మెడియ‌న్ కు ఇంకా కొవ్వు త‌గ్గ‌లేదు. ఇప్ప‌టికీ అదే బ‌లుపు చూపిస్తూనే ఉన్నాడు. అయినా మ‌నిషికి అన్నింటికంటే పెద్ద షాక్ గుణ‌పాఠం. ఓ సారి షాక్ త‌గిలిన త‌ర్వాత దాన్నుంచి ఏం నేర్చుకోక‌పోతే అంత‌కంటే దారుణం మ‌రోటి ఉండ‌దు. వ‌డివేలు విష‌యంలో ఇదే జ‌రుగుతుందేమో అనిపిస్తుంది. అప్ప‌ట్లో ర‌జినీకాంత్ పై నోటికొచ్చిన కామెంట్స్ చేసి అడ్డంగా బుక్క‌య్యాడు. అప్పుడు తొక్కితే ఐదేళ్ళు ఖాళీగా ఉండి ఈ మ‌ధ్యే మ‌ళ్లీ బిజీ అవుతున్నాడు. మెర్స‌ల్ లో న‌టించి మున‌ప‌టి ఫామ్ అందుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.

అంత‌లోనే ఈయ‌న‌పై మ‌ళ్లీ షాకింగ్ రూమ‌ర్స్ వ‌స్తున్నాయి. మ‌నోడిలో ఇంకా మార్పు రాలేద‌ని.. మున‌ప‌టిలా అలాగే బ‌లుపు చూపిస్తున్నాడ‌నే టాక్ వినిపిస్తుంది. ప్ర‌స్తుతం శంక‌ర్ శిష్యుడు చింబుదేవన్ ద‌ర్శ‌క‌త్వంలో హింసించే 24వ రాజు పులికేశి సీక్వెల్ చేస్తున్నాడు. ఈ చిత్ర టైటిల్ కు త‌గ్గ‌ట్లే ఇప్పుడు వ‌డివేలు వాళ్ల‌ను హింసిస్తున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా క్రియేటివ్ డిఫెరెన్సులు అంటూ క‌థ‌లో వేలు పెట్టి చంపేస్తున్నాడ‌ని తెలుస్తుంది. ఈ విష‌యంపై నిర్మాత శంక‌ర్ కూడా సీరియ‌స్ గా ఉన్నాడు. దాంతో త‌మిళ నిర్మాత‌ల మండలికి వ‌డివేలుపై ఫిర్యాదు చేసాడు శంక‌ర్. దాంతో త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ ఈయ‌న్ని బ్యాన్ చేసింది.

పులికేశి సెట్ లో వడివేలు, చింబుదేవన్ మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ప్ర‌తీ చిన్న విష‌యాన్ని కావాల‌నే పెద్ద‌ది చేసి షూట్ ఆగ‌డానికి కార‌ణం అవుతున్నాడు వ‌డివేలు. వడివేలు ప్రవర్తనపై శంక‌ర్ కూడా చాలా సీరియ‌స్ గా ఉన్నాడ‌ని తెలుస్తోంది. షూటింగ్‌కు సరైన టైమ్ కు రాక‌పోవ‌డం.. రెమ్యూనరేషన్ విషయంలో ఇబ్బంది పెట్టడం వంటివి చేస్తున్న‌ట్లు వ‌డివేలుపై కంప్లైంట్స్ వ‌స్తున్నాయి. దాంతో మ‌ళ్లీ ఈయ‌న్ని త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ దూరం పెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. మొత్తానికి ఐదేళ్ల త‌ర్వాత ఈ మ‌ధ్యే కాస్త టైమ్ బాగున్న‌ట్లు అనిపిస్తుంద‌నుకుంటే.. మ‌ళ్లీ త‌నే త‌న కెరీర్ కు పెద్ద బొక్క పెట్టుకుంటున్నాడు ఈ సీనియ‌ర్ క‌మెడియ‌న్. మ‌రి శంక‌ర్ త‌లుచుకుంటే మ‌నోడి కెరీర్ ఏమైపోతుందో పాపం..?

More Related Stories