English   

శేఖ‌ర్ క‌మ్ముల స‌స్పెన్స్ డ్రామా.. 

Sekhar-Kammula
2018-09-15 11:14:26

అవునా.. సాఫ్ట్ సినిమాలు చేసే శేఖ‌ర్ క‌మ్ముల స‌స్పెన్స్ డ్రామా చేస్తున్నాడా..? అయినా ఒక్క‌సారి న‌య‌న‌తార‌తో అనామిక అంటూ చేసాడు క‌దా.. అది తేడా కొట్టిన త‌ర్వాత కూడా మ‌రోసారి స‌స్పెన్స్ డ్రామాతో ప‌నేంటి అనుకుంటున్నారా..? క‌మ్ముల సస్పెన్స్ డ్రామా నిజ‌మే కానీ అది సినిమా మాత్రం కాదు. ఆయ‌న రియ‌ల్ లైఫ్ స‌స్పెన్స్ డ్రామా అది. ఈయ‌నిప్పుడు ఏం చేస్తున్నాడో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. ఎందుకు సైలెంట్ గా ఉన్నాడో ఆయ‌న‌కు కూడా అర్థం కావ‌డం లేదు. ఈయ‌న నెక్ట్స్ హీరో ఎవ‌రో తెలియ‌క‌.. సినిమా ఏంటో తెలియ‌క అభిమానులు కూడా ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పుడు ఈయ‌న చూపు విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై ప‌డింద‌ని తెలుస్తుంది. ఈ హీరోకు ఇంత‌గా ఫ్యాన్ ఫాలోయింగ్ రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అత‌డి భాష‌. తెలంగాణ యాస‌లో మాట్లాడితే ఎవ‌రేం అనుకుంటారో అనుకోకుండా.. త‌న యాస‌నే త‌న ప్ర‌త్యేక‌థ‌గా మార్చుకున్నాడు. ఈ కుర్ర హీరో కోస‌మే తెలంగాణ యాస డైలాగులు రాస్తున్నారు ద‌ర్శ‌కులిప్పుడు. 

ఇక ఇప్పుడు ఇలాంటి హీరోతో శేఖ‌ర్ క‌మ్ముల జోడీ క‌ట్ట‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. ఫిదా లాంటి బ్లాక్బ‌స్ట‌ర్ త‌ర్వాత క‌మ్ముల మ‌రోసారి తెలంగాణ క‌థే చేయ‌బోతున్నాడు. ఈ సారి కూడా నిర్మాత దిల్ రాజే. వీళ్లిద్ద‌రి కాంబినేష‌న్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించ‌బోతున్నాడు. ప‌క్కా తెలంగాణ నేప‌థ్యంలోనే ఈ ప్రేమ‌క‌థ కూడా ఉండ‌బోతుంది. ప్ర‌స్తుతం క‌థ సిద్ధం చేసే ప‌నిలో ఉన్నాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. అన్న‌ట్లు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసింది క‌మ్ములే. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లో చిన్న పాత్ర‌తో ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు ఈ కుర్ర హీరో. ఇప్పుడు ఏకంగా శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలోనే హీరోగా న‌టించ‌బోతున్నాడు. గీత‌గోవిందం త‌ర్వాత విజ‌య్ మార్కెట్ 100 కోట్ల‌కు చేరిపోయింది. ఇప్పుడు కానీ శేఖ‌ర్ క‌మ్ముల స‌రైన సినిమా ఇచ్చాడంటే దెబ్బ‌కు ర‌య్ మంటూ రాకెట్ లా ఇంకా పైకి వెళ్లిపోతుంది విజ‌య్ మార్కెట్. 

More Related Stories