English   

అల్లుడుకు క‌లెక్ష‌న్లు.. అమ్మ‌డుకు ప్ర‌శంస‌లు.. 

Shailaja-Reddy-Alludu-U-turn
2018-09-15 11:29:25

ఇప్పుడు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర జ‌రుగుతున్న‌ది ఇదే. శైల‌జారెడ్డి అల్లుడు.. యూ ట‌ర్న్ సినిమాలు ఒకేరోజు రావ‌డంతో అక్కినేని అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ కూడా ఈ సినిమాల కోసం చూసింది. భార్యాభ‌ర్త‌ల పోరులో ఎవ‌రు గెలుస్తారు అని తెలుసుకోడానికి చాలా రోజుల నుంచి ఈ పోరు కోసం వేచి చూస్తున్నారు. ఇప్పుడు ఈ పోరు ముగిసింది. తొలిరోజు స‌మ‌రంలో భ‌ర్తే గెలిచాడు. టాక్ తో ప‌నిలేకుండా శైల‌జారెడ్డి అల్లుడు తొలిరోజు వ‌సూళ్ళు ఓ రేంజ్ లో కుమ్మేసాడు. ఏకంగా 7 కోట్ల షేర్.. 12 కోట్ల గ్రాస్ తో ర‌చ్చ ర‌చ్చ చేసాడు. అదే స‌మ‌యంలో స‌మంత యూ ట‌ర్న్ మాత్రం చాలా త‌క్కువ‌గా వ‌సూళ్లు రాబ‌ట్టింది. తొలిరోజు ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో కలిపి కేవలం కోటి 20 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది.

టాక్ అద్భుతంగా వ‌చ్చినా కూడా ఎందుకో తెలియ‌దు కానీ ఈ సినిమా వైపు ప్రేక్ష‌కులు పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌లేదు. అవ‌త‌ల టాక్ బాగోలేక‌పోయినా కూడా స్టార్ ప‌వ‌ర్ ఉంది కాబ‌ట్టి అంతా అల్లుడిపైనే ప‌డ్డారు. రెండోరోజు కూడా అల్లుడు చుట్టూనే ప్రేక్ష‌కులు తిరుగుతున్నారు కానీ అమ్మ‌డు చుట్టూ తిర‌గ‌డం లేదు. చూస్తుంటే యావ‌రేజ్ టాక్ తోనే శైల‌జారెడ్డి అల్లుడు ఏదో మాయ చేసేలా క‌నిపిస్తున్నాడు. అదే స‌మ‌యంలో స‌మంత మాత్రం కేవ‌లం ప్ర‌శంస‌ల ద‌గ్గ‌రే ఆగిపోయేలా క‌నిపిస్తుంది. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు పండ‌గ క‌లిసొస్తే ఎప్పుడూ క‌లెక్ష‌న్ల‌కు ఢోకా ఉండ‌ద‌ని శైల‌జారెడ్డి అల్లుడు మ‌రోసారి ప్రూవ్ చేసాడు. మ‌రో మూడు రోజుల పాటు అల్లుడు ఇదే జోరు కానీ చూపించాడంటే క‌చ్చితంగా సేఫ్ జోన్ లోకి వ‌స్తాడు. లేదంటే మాత్రం తిప్ప‌లు త‌ప్ప‌వు. ప్ర‌స్తుతానికి టాక్ ప్ర‌కారం స‌మంత‌.. క‌లెక్షన్ల ప్ర‌కారం నాగ‌చైత‌న్య ముందున్నారు.     

More Related Stories