English   

ఎన్టీఆర్ చూడ్డానికే టఫ్ గా కనిపిస్తాడట

NTR's Anaganaganaga Song Released From Aravinda Sametha
2018-09-15 17:13:49

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మోస్ట్ ప్రిస్టీజియస్ మూవీ అరవింద సమేత వీరరాఘవ. చెప్పినట్టుగానే చెప్పిన టైమ్ కు ఈ మూవీ నుంచి లిరికల్ సాంగ్ ను విడుదల చేశాడు. ఆ పాట అదిరిపోయింది. కానీ అంతకు మించిన సర్ ప్రైజ్ కూడా ఇచ్చాడు త్రివిక్రమ్. పాటకు ముందే ఓ అద్భుతమైన రొమాంటిక్ వీడియోను కూడా యాడ్ చేశాడు. పూజా హెగ్డే, ఎన్టీఆర్ మధ్య వచ్చే ఈ సన్నివేశం మోస్ట్ రొమాంటిక్ గానే ఉంది. పైగా పూజా హెగ్డే వాయిస్ కూడా అదిరిపోయింది. ఈ సినిమాలో తనే డబ్బింగ్ చెప్పుకుంటోంది కదా. మొత్తంగా ఈ వీడియోలో పూజా చెప్పిన ‘‘ టఫ్ గా కనిపిస్తారు కానీ.. మాట వింటారు. ఫర్లేదు.. ’’ అనే డైలాగ్ కు ఎన్టీఆర్ ఇచ్చిన కిల్లర్ ఎక్స్ ప్రెషన్స్ కు ఫిదా అయిపోవాల్సిందే.

ఇక తమన్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీలోని ఈ పాటను సిరివెన్నెల సీతారామారశాస్త్రి రాశారు. చాలాకాలం తర్వాత ఆయన్నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ వచ్చింది. అయితే ఇందులో తన మార్క్ పదాలతో మాయాజాలం చేశారు. అమ్మాయిలను పొగిడే విధానం కూడా కొత్తగా ఉంది. ‘‘చీకటిలాంటి పగటిపూట, కత్తుల్లాంటి పూలతోటా, జరిగిందొక వింత వేటా, పులిపై పడిన లేడీ కథ వింటారా’’ అంటూ సాగే పల్లవి అదిరిపోయింది. ఇవే కాదు.. ఈ పాటలో పదాలన్నీ సూపర్బ్. సిరివెన్నెల ఈ మధ్య ఫ్రెష్ ట్యూన్స్ తో ఆకట్టుకుంటోన్న తమన్ ఈ సారి తన జూలు విదిల్చినట్టు కనిపిస్తోంది. అద్భుతమైన ట్యూన్ కు అదిరిపోయే స్వరాలందించాడు.

మొత్తంగా టీజర్ అన్ని వర్గాలను ఆకట్టుకోలేకపోయినా.. ఈ పాటతో మెస్మరైజ్ చేశాడనే చెప్పాలి. ఇక ఈ నెల 20న అరవింద సమేత వీరరాఘవ ఆడియో ఫంక్షన్ జరగబోతోంది. అందులో థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇక పూజగా హెగ్డేతో పాటు ఈషా రెబ్బా కూడా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో జగపతిబాబు, రావురమేష్, నాగబాబు, సునిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏదేమైనా ఈ పాటతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఓ కొత్త జోష్ వచ్చినట్టే అని చెప్పాలి.

More Related Stories