English   

హీరోగా ‘బిత్తిరి సత్తి’

Bithiri Sathi's Tupaki Ramudu Movie First Look Poster Released By Sukumar
2018-09-15 22:48:55

టాలెంట్ ఉన్నోడికి టైమ్ లేట్ అవ్వొచ్చేమో కానీ ఎప్పటికైనా ఆ టైమ్ వచ్చి తీరుతుంది. అలాగని బిత్తిరి సత్తి హీరో మెటీరియల్ కాదు. బట్.. కొన్ని కథలకు అతను హీరో కావొచ్చు. అందుకే టిఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మాతగా మారి బిత్తిరి సత్తి హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. చాలాకాలంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను సుకుమార్ చేతుల మీదుగా విడుదల చేశారు. సినిమా టైటిల్ ‘‘తుపాకి రాముడు’’. తుపాకి రాముడు తెలంగాణ పల్లెల్లో గొప్పలకు పోయే క్యారెక్టర్ గా మంచి ఫేమస్. ఈ తుపాకి రాముడు పేరుమీదుగా ఇప్పటికే ఎన్నో కామెడీ వీడియోస్, ఆడియోస్ వచ్చాయి. కానీ మారిన ట్రెండ్ ఆ రాముడి కామెడీ కాస్త ఓల్డ్ అయిపోయింది. అలాంటి క్యారెక్టర్ ను తీసుకుని బిత్తిరి సత్తి టైటిల్ పాత్రలో రసమయి నిర్మిస్తోన్న ఈ మూవీకి టి ప్రభాకర్ దర్శకుడు. ఇతను గతంలో ‘బతుకమ్మ’ అనే సినిమా తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

ఓ న్యూస్ ఛానల్ లో కామెడీగా వార్తలు చెప్పే ప్రోగ్రామ్ తో ఫేమస్ అయిన సత్తికి స్టార్ సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది. అతని కోసమే ఆ ఛానల్ లో రాత్రి వార్తలు చూసే ప్రేక్షకులు తెలంగాణలోనే కాదు.. ఆంధ్రలోనూ ఉణ్నారు. ఒక రకంగా బిత్తిరి సత్తి వల్ల ఆ ఛానల్ కు మంచి రేటింగ్స్ కూడా వస్తుంటాయి. అలాంటి బిత్తిరి సత్తి అసలు పేరు రవి కుమార్. మొత్తంగా ఇప్పటికే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తూ వస్తోన్న బిత్తిరి సత్తిని హీరోగా పెట్టి సినిమా తీయడం అంటే చిన్న విషయమేం కాదు. ఇక  ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. రెండు పాటలు చిత్రీకరణ మిగిలి ఉందట. మరి హీరోగా బిత్తిరి సత్తి సినిమా ఆసాంతం ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

More Related Stories