English   

సమంత మీద అర్జున్ రెడ్డి ప్రభావం

Arjun Reddy Movie Effect on Samantha Akkineni
2018-09-16 06:20:58

సమంత.. వరుస హిట్స్ తో దూసుకుపోతోన్న బ్యూటీ. లేటెస్ట్ గా వచ్చిన యూ టర్న్ కు భారీ హిట్ అనే టాక్ రాకపోయినా ఫర్వాలేదనిపించుకుంటోంది. అటు నాగచైతన్య చేసిన శైలజా రెడ్డి అల్లుడు టాక్ వీక్ గా ఉన్నా కలెక్షన్స్ కాస్త స్ట్రాంగ్ గానే ఉన్నాయంటున్నారు. మొత్తంగా మొగుడూపెళ్లాం మధ్య బాక్సాఫీస్ వార్ జరిగినా ఎవరూ హర్ట్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.అంటే ఈ కపుల్ ఎంత అండర్ స్టాండింగ్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా యూ టర్న్ పోస్ట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న సమంత లేటెస్ట్ గా ఓ టివి షోకు గెస్ట్ గా వెళ్లింది. అది మరెవరిదో కాదు.. స్టార్ కమెడియన్ అలీ నిర్వహిస్తోన్న ‘అలీతో సరదాగా’ ప్రోగ్రాం. సక్సెస్ ఫుల్ గా సాగుతోన్న ఈ షో వందవ ఎపిసోడ్ కు సమంత గెస్ట్ గా వెళ్లింది. నిజానికి ఈ ఇద్దరి మధ్య కామెడీ పరంగా మంచి కెమిస్ట్రీ కూడా ఉంటుంది. ఈ విషయం గతంలో చాలా పబ్లిక్ ఫంక్షన్స్ లోనూ కనిపించింది. మొత్తంగా ఈ షోలో అలీ అమ్మడికి నుంచి కొన్ని టిపికల్ క్వశ్చన్స్ సంధించినట్టే తెలుస్తోంది. లేటెస్ట్ గా ఈ ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో యూట్యూబ్ లో హల్చల్ చేస్తోంది.

ఇందులో భాగంగా నాగచైతన్యను ఇంట్లో ఏమని పిలుస్తావు అని అడిగాడు అలీ. దీనికి సమంత తెగ సిగ్గుపడిపోయింది. అలా పడుతూనే తానెలా పిలుస్తానో చెప్పింది. రీసెంట్ గా వచ్చిన అర్జున్ రెడ్డి ప్రభావం వల్లేమో.. శామ్, చైతూను ‘‘బేబీ’’ అని పిలుస్తుందట. మరి చైతూ ఏమని పిలుస్తాడు అని కూడా అడిగాడు అలీ. ప్రోమో కదా.. మొత్తం చెప్పలేదు. కానీ ఫైనల్ గా అలీ అడిగిన మాట భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది. అదేంటో తెలుసా.. సమంతను నీ పిల్లలు ఏం చేస్తున్నారు అని అడిగాడు. ఈ విషయం మనం సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం గుర్తుందా అని హింట్ కూడా ఇచ్చాడు. దీనికి సమంత ‘మీరు చాలా డేంజర్ అలీగారూ’ అని చెప్పడం విశేషం. మొత్తంగా శామ్.. చెయ్ ను బేబీ అని పిలుస్తుందన్నమాట.

More Related Stories