English   

బాబుల ఫన్ అయిపోయింది

Venkatesh Varun Tej F2 Fun and Frustration Prague Schedule Wrapped
2018-09-16 14:17:24

ఇప్పుడు వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ తో పాటు అనిల్ రావిపూడి జోరు చూస్తుంటే ఇదే అనాలనిపిస్తుంది. తాజాగా ఈ చిత్రం మ‌రో షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ప‌ది రోజులుగా ప్రాగ్య్ లో జ‌రుగుతున్న షెడ్యూల్ కు రాం రాం చెప్పేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఎఫ్ 2 లో వెంక‌టేష్ కు జోడీగా త‌మ‌న్నా.. వ‌రుణ్ తేజ్ కుజో డీగా మెహ్రీన్ న‌టిస్తుంది. ఇప్ప‌టికే ఈ షెడ్యూల్ లో వాళ్ల పాత్ర పూర్తైపోయింది. రాజేంద్ర ప్ర‌సాద్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. వెంకీ, వ‌రుణ్ తేజ్ తో పాటు రాజేంద్రుడు కూడా ఈ షెడ్యూల్ లో ఉన్నాడు. ప్రాగ్య్ లో పాట‌తో పాటు కొన్ని కామెడీ సీన్స్ కూడా చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు.

ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న తీరు కానీ.. అందుతున్న స‌మాచారం ప్ర‌కారం చూస్తుంటే ఇది గోల్ మాల్ సినిమా మాదిరిగా ఉంటుంది అని తెలుస్తుంది. వెంక‌టేష్, వ‌రుణ్ పాత్ర‌లు కూడా ఫుల్ కామెడీగా ఉంటాయ‌ని.. క‌డుపులు చెక్క‌లయ్యే కామెడీ ఇందులో అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ప్ర‌మోష‌న్ కూడా గోల్ మాల్ ను గుర్తుకు తెస్తుంది. యూనిట్ అంతా కూర్చుని పోజులివ్వ‌డం కేవ‌లం రోహిత్ శెట్టి సినిమాల‌కు మాత్ర‌మే జ‌రుగుతుంది. పైగా ప్ర‌తీ షెడ్యూల్ కు ముందు త‌ర్వాత ఫోటోలు విడుద‌ల చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఈ చిత్రం త‌ప్ప‌కుండా త‌న‌కు వ‌ర‌స‌గా నాలుగో విజ‌యాన్ని అందిస్తుంద‌ని న‌మ్ముతున్నాడు అనిల్. ఇదే జ‌రిగితే మ‌నోడి రేంజ్ మ‌రింత పెర‌గ‌డం ఖాయం. 2019 జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది ఎఫ్ 2.

More Related Stories