English   

అరవింద సమేత పని అయిపోయింది గురూ

NTR's Aravinda Sametha Shooting Wrapped except two Songs
2018-09-16 14:46:32

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందుతోన్న క్రేజీయొస్ట్ ప్రాజెక్ట్ అరవింద సమేత వీరరాఘవ. పూజా హెగ్డే, ఈషారెబ్బా హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారికహాసిని బ్యానర్ పై రూపొందుతోన్న ఈ మూవీ పై ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి. వాటిని అందుకోవడానికి త్రివిక్రమ్ ముందు నుంచీ తెగ హార్డ్ వర్క్ చేస్తున్నాడు. పైగా అజ్ఞాతవాసి అట్టర్ ఫ్లాప్ కావడంతో త్రివిక్రమ్ మరింత కసిగా ఈ అరవిందుడిపై కాన్ సెంట్రేట్ చేశాడు. ఈ క్రమంలో ఆ మధ్య వదిలిన టీజర్ ఆకట్టుకుంది. లేటెస్ట్ గా వచ్చిన పాట దుమ్మురేపుతోంది. ఇక ఈ నెల 20న ఆడియో ఫంక్షన్ కూడా జరుపుకోబోతోన్న అరవింద సమేత వీరరాఘవ కు సంబంధించి మరో గుడ్ న్యూస్ కూడా వచ్చింది.

అరవింద సమేత వీరరాఘవ షూటింగ్ పూర్తయింది. యస్.. తండ్రి చనిపోయిన బాధలోనూ మిగిలిన భాగాన్ని ఫినిష్ చేసిన ఎన్టీఆర్ తన ప్రొఫెషనలిజాన్ని పర్ఫెక్ట్ గా చూపించడంతో ఈ మూవీ అనుకున్న టైమ్ కే అయిపోయిందని చెబుతున్నారు. కాకపోతే ఓ రెండు పాటల షూటింగ్ మాత్రం బ్యాలన్స్ ఉంది. ఈ లోగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆడియో ఫంక్షన్ తర్వాత ఆ రెండు పాటలను యూరప్ లో చిత్రీకరిస్తారు. ఇందుకోసం ఈ నెల 21న యూనిట్ మొత్తం యూరప్ తరలి వెళ్లబోతోంది. సో అనుకున్నట్టుగానే ఈ సినిమా అక్టోబర్ 11న ఆడియన్స్ ముందుకు వస్తుందన్నమాట.

More Related Stories