English   

తమిళ్ లో నిర్మాత అవతారం ఎత్తిన సుకుమార్

Director Sukumar Entering into Tamil Fil Industry as a Producer
2018-09-16 17:08:08

సుకుమార్.. ఈ పేరుకు తెలుగులో ఉన్న క్రేజ్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. క్రియేటివ్ డైరెక్ట‌ర్ గా ఈయన ఇమేజ్ ఆకాశం. ఏం చేసినా కూడా కొత్త‌గా ఆలోచిస్తాడ‌నే పేరుంది. ఇలాంటి ద‌ర్శ‌కుడి నుంచి ఏడేళ్ల కింద వ‌చ్చిన సినిమా 100 ప‌ర్సెంట్ ల‌వ్. నాగ‌చైత‌న్య కెరీర్ కు మంచి పునాది వేసిన సినిమా ఇది. యూత్ కు అర్థం కాని క‌న్ఫ్యూజ‌న్స్.. వాళ్ల మ‌ధ్య ఉండే ఇన్ ఫ్యాక్చువేష‌న్స్ ను స‌రిగ్గా బేరీజు వేసుకుని ఈ సినిమా చేసాడు సుకుమార్. అప్ప‌ట్లో ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఇక ఇప్పుడు ఇదే సినిమాను త‌మిళ‌నాట రీమేక్ చేసారు. అక్క‌డ జివి ప్ర‌కాశ్ హీరోగా అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఆ మధ్య విడుద‌లైన టీజ‌ర్ చూస్తుంటే సినిమాను ఎంత ప‌క్కాగా ఫ్రేమ్ టూ ఫ్రేమ్ దించేసారో అర్థ‌మైపోతుంది. ఇక్క‌డ విచిత్రం ఏంటంటే క‌థ‌కుడిగా ఎలాగూ ఉన్న సుకుమార్.. త‌మిళ ఇండ‌స్ట్రీకి నిర్మాత‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. అక్క‌డ 100 ప‌ర్సెంట్ కాద‌ల్ ను ఈయ‌నే నిర్మిస్తున్నాడు. ఎమ్ఎమ్ చంద్ర‌మౌళి ద‌ర్శ‌కుడు. ఖచ్చితంగా ఈ చిత్రంతో త‌మిళ‌నాట సుకుమార్ స‌క్సెస్ ఫుల్ ఎంట్రీ ఇస్తాడ‌నే న‌మ్ముతున్నారు అత‌డి అభిమానులు కూడా. మ‌రోవైపు తెలుగు ఇండ‌స్ట్రీ నుంచి కూడా ఈయ‌న‌కు బెస్ట్ విషెస్ అందిస్తున్నారు. అన్నింటికి మించి జివి ప్ర‌కాశ్ హీరోగా స‌క్సెస్ ఫుల్. ఈయ‌న న‌టించిన సినిమాల‌న్నీ దాదాపు బాగానే ఆడాయి. దాంతో ఇప్పుడు 100 ప‌ర్సెంట్ కాద‌ల్ కూడా 200 ప‌ర్సెంట్ ఆడుతుంద‌ని న‌మ్ముతున్నాడు సుకుమార్. మ‌రి ఈయ‌న న‌మ్మ‌కం ఎంత‌వ‌ర‌కు గెలుస్తుందో చూడాలి.

More Related Stories