English   

ఆయన ఆ హీరోయిన్ ను వదిలేలా లేడే..?

Ravi babu Can't Leave Hottest Actress Poorna
2018-09-16 18:27:59

కొన్ని కాంబినేషన్స్ ఫెవికాల్ బాండ్ లా అతుక్కుంటాయి. అలాగని ఇందులో డబుల్ మీనింగ్ ఏం లేదు. జస్ట్ వారి మధ్య అడర్ స్టాండింగ్ అలా కుదురుతుందంతే. లేదంటే ఒక మంచి స్నేహ బంధం కూడా ఉండొచ్చు. అందుకే దర్శకుడు రవిబాబు.. మనాళ్లు మర్చిపోతోన్న ప్రతిసారీ పూర్ణను తీసుకువస్తున్నాడు. యస్.. కొన్నాళ్ల క్రితం అల్లరి నరేష్ సినిమాలో కనిపించిన పూర్ణకు ఆ తర్వాత ఆఫర్స్ రాలేదు. దీంతో మనవాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు ‘అవును’ అనే సినిమాతో మళ్లీ తెచ్చింది రవిబాబే. ఆ తర్వాత కూడా మళ్లీ ఆఫర్స్ లేని టైమ్ లో ‘అవును-2’ అంటూ మళ్లీ ఓ సినిమా చేశాడు. అవును హిట్ అయినా దాని సీక్వెల్ ఫట్ అయింది. ఇక లాస్ట్ ఇయర్ ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి విజయవంతమైన సినిమా చేసినా పూర్ణకు బ్రేక్ రాలేదు. ప్రస్తుతం కన్నడ, మళయాల సీమల్లో సీమఖాసీం పేరుతో సినిమాలు చేస్తోన్న పూర్ణకు మరోసారి రవిబాబు నుంచి పిలుపు వచ్చింది. ఈ సారి ‘బంటి’ కోసం. బంటి అంటే తెలుసు కదా.. రవిబాబు సినిమాలో నటిస్తోన్న ‘పిగ్ లెట్’.

Hottest Actrtess Poorna Avunu 2 Movie Poster

ఓ పందిపిల్లతో సినిమా చేస్తున్నాని రవిబాబు చెప్పినప్పుడు ఎవరూ పెద్దగా నమ్మలేదు. కానీ అతను చేసి చూపించాడు. అత్యంత కష్టతరమైన పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసి రీసెంట్ గా ఓ ట్రైలర్ కూడా వదిలాడు. బంటిగా ఆ పిగ్ లెట్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి కూడా. అయితే కేవలం పిగ్ లెట్ ను మాత్రమే చూడాలంటే కాస్త కష్టం కదా. అందుకే పూర్ణకు కబురు పెట్టాడు రవిబాబు. ఈ సినిమాలో పిగ్ లెట్ తో కలిపి తనతో ఓ ఐటమ్ సాంగ్ చేయించాడట. అదుగో ఆ పాటలోని హాటెస్ట్ స్టిల్లే ఇది. ఇక ‘అదుగో’ పేరుతో రూపొందుతోన్న ఈ మూవీని దసరా సందర్భంగా విడుదల చేయబోతున్నాడు రవిబాబు. ఇక ఈ సినిమాకు సురేష్ ప్రొడక్షన్స్ వంటి బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అండ దొరకడం విశేషం అనే చెప్పాలి. మరో విశేషం ఏంటంటే.. ఈ మూవీని అన్ని ఇండియన్ లాంగ్వేజెస్ లోకీ డబ్ చేస్తున్నాడు రవిబాబు. మరి ఈ బంటి విన్యాసాలు, పూర్ణ అందాలు ఈ సినిమాను ఏ మేరకు ఆదుకుంటాయో చూడాలి.

Hottest Actress Poorna From Ravi Babu's Adhugo

More Related Stories