English   

భార్య భర్తల పోరులో భర్త విజయం

Naga Chaitanya Dominates Samantha at Box Office
2018-09-16 19:13:07

ఇది ఇండ‌స్ట్రీ.. సినిమా ఇండ‌స్ట్రీ.. బిగ్ బాస్ కంటే దారుణం.. ఇక్క‌డ ఏదైనా జ‌ర‌గొచ్చు. ఇప్పుడు నాగ‌చైత‌న్య‌, స‌మంత విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ఈ ఇద్ద‌రూ వినాయ‌కుడి సాక్షిగా బాక్సాఫీస్ పోరులో దిగారు. స‌మంత యూ ట‌ర్న్.. నాగ‌చైత‌న్య శైల‌జారెడ్డి అల్లుడు ఒకేరోజు విడుద‌ల అయ్యాయి. తొలిరోజూ ఈ రెండు సినిమాల్లో స‌మంత సినిమాకు మంచి టాక్ వ‌చ్చింది. చైతూ సినిమాకు బాగోలేద‌నే టాక్ బ‌య‌టికి వ‌చ్చేసింది. అయితే స్టార్ ప‌వ‌ర్ ముందు పాపం స‌మంత నిల‌బ‌డ‌లేక‌పోతుంది. మంచి సినిమా అంటున్నా కూడా ఇప్పుడు యూ ట‌ర్న్ వైపు ప్రేక్ష‌కుల ట‌ర్న్ ప‌డ‌టం లేదు.

Naga Chaitanya's Shailaja Reddy Alludu Poster

అదే స‌మ‌యంలో యావ‌రేజ్ అంటున్న అల్లుడి వైపు మేమున్నాం అంటూ చైతూకు స‌పోర్ట్ గా నిలుస్తున్నారు ప్రేక్ష‌కులు. యూ ట‌ర్న్ మూడు రోజుల్లో క‌నీసం 3 కోట్ల షేర్ తీసుకురాలేక‌పోయింది.. మ‌రోవైపు నాగ‌చైత‌న్య సినిమా మాత్రం మూడు రోజుల్లోనే ఏకంగా 23 కోట్ల గ్రాస్.. 13 కోట్ల‌కు పైగా షేర్ తీసుకొచ్చింది. విచిత్రం ఏంటంటే టాక్ తేడాగా ఉన్నా కూడా ఈ సినిమా వ‌సూళ్లు మాత్రం స్ట‌డీగానే ఉన్నాయి. అయితే వీకెండ్ త‌ర్వాత క‌లెక్ష‌న్లు ఎలా ఉంటాయ‌నేది మాత్రం ఆస‌క్తిక‌ర‌మే. ప్ర‌స్తుతానికి లెక్కల ప్ర‌కారం అయితే భార్య‌పై భ‌ర్త స్ప‌ష్ట‌మైన విజ‌యం సాధించాడు. పోనీలే ఇంట్లో డామినేష‌న్ ఎవ‌రిదైనా కూడా బ‌య‌ట మాత్రం భ‌ర్త గెలిచాడు.

Samantha's U Turn Poster

More Related Stories