English   

అక్కినేని ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్

Akkineni Fans Enjoyable News From Akkineni Heroes
2018-09-16 22:20:01

అక్కినేని నాగేశ్వరరావు తర్వాత రెండు తరాల వారసులు వచ్చారు ఆ ఫ్యామిలీలోకి. ప్రస్తుతం మొత్తం ఫ్యామిలీకి సినిమాల పరంగా పెద్ద దిక్కు నాగార్జున. తన ఇద్దరు తనయులతో కలిసి ఇప్పటికీ కంటిన్యూస్ గా సినిమాలు చేస్తున్నాడు నాగ్. ప్రస్తుతం తన పెద్ద కొడుకు శైలజారెడ్డి అల్లుడు సక్సెన్ ను ఆస్వాదిస్తోన్న నాగార్జున అండ్ ఫ్యామిలీ ఓ సెన్షేషనల్ గిఫ్ట్ ఇవ్వబోతోంది వారి ఫ్యాన్స్ కు. యస్.. నిజంగా వీరి ఫ్యామిలీ నుంచి ఇలాంటి గిఫ్ట్ రావడం ఇదే ఫస్ట్ టైమ్. అందుకు ఖచ్చితంగా సరిపోయే డేట్ ను కూడా ఎంచుకోవడం విశేషం.

ఈ నెల 20.. అక్కినేని ఫ్యామిలీకి పండగ రోజు. కారణం ఆ రోజు అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి. ఆయన లేకపోయినా జయంతిని ఘనంగానే నిర్వహిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఈ నేపథ్యంలో అభిమానుల కోసం ముగ్గురు హీరోలూ ఓ కొత్త ప్లాన్ చేశారు. అదేంటో తెలుసా.. తండ్రి బర్త్ యానివర్సరీ కానుకగా నాగార్జున తన లేటెస్ట్ మూవీ దేవదాస్ ట్రైలర్ విడుదల చేయబోతున్నాడు. దీనికి ఆ రోజు ఏ టైమ్ కు రిలీజ్ చేస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రావాలి. కానీ ఖచ్చితంగా అదే రోజు వస్తుంది. నాగ్.. నానితో కలిసి నటించిన మల్టీస్టారర్ ఇది. శ్రీరామ్ ఆదిత్య డైరెక్టర్. అశ్వనీదత్ నిర్మాత. ఇప్పటికే వచ్చి టీజర్, లిరికల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 27న సినిమా విడుదల కాబోతోంది. ఆ సందర్భంగా తన తండ్రి జయంతి నాడు దేవదాస్ ట్రైలర్ తో ఫ్యాన్స్ కు సరికొత్త కిక్ ఇవ్వబోతున్నాడు కింగ్.

ఇక అఖిల్ కూడా తన మూడో సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను విడుదల చేయబోతున్నాడు. అఖిల్ కాస్త ముందుగానే 19వ తేదీ సాయంత్రం 4గంటలకు తన థర్డ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నాడు. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక నాగచైతన్య కూడా సవ్యసాచి సినిమాకు సంబంధించి మరో టీజర్ విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. చైతూకు ప్రేమమ్ వంటి భారీ హిట్ ఇచ్చిన చందు మొండేటి డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. కానీ కొన్ని సీన్స్ ను రీ షూట్ చేస్తున్నారనే టాక్ ఉంది. ఇక శైలజారెడ్డి సక్సస్ ను ఎంజాయ్ చేస్తోన్న చైతూ.. తాతగారి జయంతి రోజున సవ్యసాచి నుంచి ఓ టీజర్ వదలాలని చూస్తున్నాడు.

మొత్తంగా సెప్టెంబర్ 20న అక్కినేని అభిమానులకు ట్రిపుల్ కిక్ దక్కబోతోంది. నాగార్జున ట్రైలర్, అఖిల్ ఫస్ట్ లుక్, చైతూ టీజర్.. ఇలా ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోల మూడు సినిమాల అప్డేట్స్ ఒకేసారి రావడం ఒక రకంగా టాలీవుడ్ లో బహుశా ఇదే ఫస్ట్ టైమేమో.. మరి ఈ మూడు సినిమాల అప్డేట్స్ ఎలా ఉంటాయో చూడాలి.

More Related Stories